Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పట్టపగలు ప్రియుడితో లేచిపోయిన పిల్లల తల్లి, రాత్రి ఇంటికి వెళ్లిన భర్త లబోదిబో !

భువనేశ్వర్/జార్ఖండ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం దంపతులు పిల్లలతో కలిసి వేరే సిటీకి వెళ్లారు. పని చేస్తూ భార్య పిల్లలను సంతోషంగా చూసుకుంటున్న భర్తకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. భర్తతో కలిసి పని చేస్తున్న పెళ్లికాని యువకుడితో కలిసి పిల్లల తల్లి పారిపోవడంతో కలకలం రేపింది.

జార్ఖండ్‌లోని మహేశ్‌పూర్ గ్రామానికి చెందిన నజీబుల్ షేక్‌ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం సహీనా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. నజీబుల్, సహీనా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జార్ఖండ్ లో పని చెయ్యడానికి సరైన ఉపాది పనులు లేకపోవడంతో కొన్ని నెలల క్రితం నజీబుల్ అతని భార్య సహీనా, ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం చెన్నై చేరుకున్నాడు.

married woman

భవన నిర్మాణ పనులు చేసుకునేందుకు చెన్నైకి వచ్చిన నజీబుల్ షేక్ అతని భార్య సహినా కలిసి చెన్నై పక్కనే ఉన్న మెదవాక్‌లోని ఓ నిర్మాణ స్థలంలో ఉంటూ అదే భవనంలో పనిచేస్తున్నారు. ఇదే భవనంలో ఒడిశాకు చెందిన సితార్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ప్రతిరోజు నజీబుల్, సితార్ కలిసి అక్కడ మేస్త్రీలుగా పని చేస్తున్నారు.

 children at home

ఇదే సమయంలో భర్త నజీబుల్ తో కలసి పని చేస్తున్న సితార్ ను సహీనా పరిచయం చేసుకుంది. రానురాను సహీనా, సితార్ ల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంకా పెళ్లికాని సితార్ కు పాలకోవా తినిపిపంచిన సహీనా అతన్ని వలలో వేసుకుంది. కొద్దిరోజుల్లోనే సితార్, సహీనాల వివాహేతర బంధం బలంగా మారిందని తెలిసింది.

ఈ క్రమంలో భవనంలో పని చెయ్యడానికి వెళ్లిన నజీబుల్ షేక్ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పిల్లలు మాత్రమే ఉండటం చూసి హడలిపోయాడు. భార్య సహీనా కనిపించడం లేదని తేలిసి ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన నజీబుల్ తెలిసినవ వాళ్లు, సాటి కూలీలను అతని భార్య గురించి అడిగాడు.

ఆ తర్వాత ఇరుగుపొరుగు వారిని విచారించి భార్య సహీనా కోసం వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త నజీబుల్ హడలిపోయాడు. భర్త నజీబుల్ తో కలిసి పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సితార్ కూడా కనిపించకుండా పోయాడని తేలింది. భార్య సహీనాపై అనుమానం వచ్చిన నజీబుల్ షేక్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పల్లికరణై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఒడిశాకు చెందిన సితార్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి పారిపోయిన నా భార్య సహీనాను తిరిగి రప్పించాలని నజీబుల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనవి చేశాడు. ఫిర్యాదు చూసిన పోలీసులకు ఫిర్యాదుదారుడు అయిన భర్త నజీబుల్, తల్లిలేని ఇద్దరు పిల్లలను చూసి చలించిపోయారు.

illegal affair

అయితే నజీబుల్ దగ్గర అతని భార్య సహీనా ఫోటో మాత్రమే ఉండటం, ప్రియుడు సితార్ ఫోటో లేకపోవడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. తనతో స్నేహంగా ఉంటూ తన కొంప ముంచిన సితార్ చిక్కితే అతని మీద కఠిన చర్చలు తీసుకోవాలని సహీనా భర్త నజీబుల్ షేక్ విలపిస్తున్నాడని, కేసు విచారణలో ఉందని చెన్నై పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+