Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు: 9 మంది దుర్మరణం: మృతదేహాలు చెల్లాచెదురు

అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది దుర్మరణం పాలయ్యారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దేశ రాజధాని రెడ్ ఫోర్ట్ వద్ద కారు బాంబు పేలుడు ఉదంతాన్ని ఇంకా విస్మరించకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.

శ్రీనగర్ నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న కొన్ని డిటొనేటర్లు, ఇతర పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం- పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు, సీనియర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

A massive explosion in Nowgam Police Station Srinagar

ఇటీవలే ఫరీదాబాద్ లో ఉగ్రవాదుల నుండి 360 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు, భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని పేలుడు పదార్థాలను నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచారు. కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. వీటిని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మృతదేహాలు 300 అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడ్డాయి.

మృతదేహాలను శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఈ పేలుడు వెనుక రెండు కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొదటిది- మెజిస్ట్రేట్ సమక్షంలో అమ్మోనియం నైట్రేట్‌ను సీల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మంటలు అంటుకోవడం. రెండవది- ఉగ్రదాడి.

పోలీస్ స్టేషన్ ఆవరణలో నిలిపి ఉన్న ఓ స్వాధీనం చేసుకున్న కారులో ఐఈడీ అమర్చి ఉండవచ్చని, అది ఈ భారీ పేలుడుకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీఏఎఫ్ఎఫ్ ఈ దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది. దీన్ని ఇంకా ఎవరూ ధృవీకరించాలేదని అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని సీల్ చేసి భద్రతా దళాలు స్నిఫర్ డాగ్స్‌తో తనిఖీలు చేపట్టాయి. శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

ఈ 360 కిలోల పేలుడు పదార్థాలను ఫరీదాబాద్‌లోని డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై అద్దె ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అరెస్టు అయిన ఎనిమిది మందిలో అతను ఒకరు. ఈ వారం ప్రారంభంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడులో 13 మంది మరణించిన నేపథ్యంలో, జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ శుక్రవారం సాయంత్రం కేంద్రపాలిత ప్రాంతంలో భద్రతా సమీక్ష నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+