Earthquake: మహారాష్ట్రతో పాటు తెలంగాణలో భూ ప్రకంపనలు.. !
ప్రపంచంలో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. మొన్నటి వరకు ఇండోనేషియా, ఫిలప్పిన్స్, నేపాల్, పాకిస్తాన్ లో భూకంపాలు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. తాజాగా మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. నవంబర్ 20, సోమవారం మహారాష్ట్రలోని హింగోలిలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఉదయం 5:09 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
మహారాష్ట్రతో పాటు తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. భూకంప కేంద్రం హింగోలి జిల్లా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 255 కిలోమీటర్లు, నాగ్ పూర్ కు 265 కిలోమీటర్ల దూరంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది గుర్తించేంత భూకంపం కాదని చెబుతున్నారు. అయితే భూమిలో నిరంతరం కదలికలు ఉంటాయని వారు చెబుతున్నారు. కాగా ఈ భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం నమోదుకాలేదు.

"భూకంపం తీవ్రత: 3.5, 20-11-2023న సంభవించింది. ఉదయం 05:09:29 గంటలకు మహారాష్ట్రలోని హింగోలి భూకంపం వచ్చింది" అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో తెలిపింది. ముందుగా, రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం అండమాన్, నికోబార్ దీవులలోని అండమాన్ సముద్రాన్ని తాకినట్లు పేర్కొన్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని NCS తెలిపింది.
15 రోజుల క్రితం నేపాల్ తీవ్ర భూకంపం సంభవించింది. నేపాల్‌కు వాయువ్యంవైపు ఉన్న జుమ్లా అనే ప్రాంతానికి 42కి.మీల దూరంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 6.4గా రికార్డు అయ్యింది. ఈ ఘటనలో 128 మంది మృతి చెందారు. జాజర్కోట్ జిల్లాలో కనీసం 26 మంది మృత్యువాత పడ్డారు.












Click it and Unblock the Notifications