Girl: స్కూల్ వాష్ రూమ్ లో అమ్మాయి మీద సీనియర్లు సామూహిక అత్యాచారం, మహిళా కమీషన్ నోటీసు!
న్యూఢిల్లీ: స్కూల్ లో, కాలేజ్ లో జూనియర్లతో సీనియర్లు కొంచెం కఠినంగా ఉంటారని అక్కడక్కడా మనం చూస్తుంటాము. అయితే పొరపాటు ఢీకొట్టిన ఓ అమ్మాయిని ఇద్దరు సీనియర్లు బూతులు తిట్టడమే కాకుండా స్కూల్ లోని వాష్ రూమ్ లోకి ఆమెను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది. అమ్మాయి మీద ప్రభుత్వ స్కూలో ఇద్దరు అబ్బాయిలు అత్యాచారం చెయ్యడంతో స్కూల్ యాజమాన్యానికి, సిటీ పోలీసులకు మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది.
వాష్ రూమ్ లో అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు అబ్బాయిల మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.

కేంద్రీయ విద్యాలయం
ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై నెలలో ఓ విద్యార్థిని ఎప్పటిలాగే స్కూల్ లోని క్లాస్ రూమ్ కు బయలుదేరింది. ఆ సందర్బంలో హడావిడిగా వెలుతున్న అమ్మాయి పొరపాటున 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న ఇద్దరు అబ్బాయిను ఢీకొట్టింది.

వాష్ రూమ్ లో సామూహిక అత్యాచారం
పొరపాటు ఢీకొట్టిన ఆ అమ్మాయిని ఇద్దరు సీనియర్లు బూతులు తిట్టారు. అమ్మాయి మీద చెయ్యి చేసుకుని స్కూల్ లోని వాష్ రూమ్ లోకి లాక్కెళ్లి డోర్ లాక్ చేశారు. మైనర్ అమ్మాయి మీద ఇద్దరు సీనియర్లు సామూహిక అత్యాచారం చేసి ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారని ఆలస్యంగా వెలుగు చూడటం కలకలం రేపింది.

స్కూల్ యాజమాన్యం ఏం చేసింది?
అమ్మాయి జరిగిన విషయం స్కూల్ ఉపాధ్యాయులకు చెప్పింది. అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు విద్యార్థులను స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపించేసిన స్కూల్ యాజమాన్యం సైలెంట్ గా ఉండిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు అబ్బాయిలను స్కూల్ నుంచి పంపించేయడంతో ఆ వివాదానికి అప్పట్లో బ్రేక్ పడింది.

నోటీసులు ఇచ్చిన మహిళా కమీషన్
తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని బాధితురాలు ఢిల్లీ మహిళా కమీషన్ కు మనవి చేసింది. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయం, ఢిల్లీ సిటీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మలివాల్ నోటీసులు జారీ చేశారు. సమగ్ర విచారణ జరిపి పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులకు ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మలివాల్ సూచించారు.

ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు
అయితే అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులు మాకు ఇంతవరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యలేదని స్కూల్ యాజమాన్యం చెప్పిందని తెలిసింది. వాష్ రూమ్ లో అమ్మాయి మీద సామూహిక అత్యాచారం చేసిన ఇద్దరు అబ్బాయిల మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఉపాధ్యాయులు, విద్యార్థులను విచారణ చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications