డబ్బులు ఇచ్చాడు, రుణం తీసుకున్న వ్యక్తి భార్య మీద వడ్డీ వ్యాపారి ? నీచ్, కమీనే, కుత్తే!

పూణే/ముంబాయి: అవసరం అయిన సమయంలో బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లు రుణం ఇస్తారని బాధితులు ఆశగా ఎదురు చూస్తారు. అవసరానికి అప్పు తీసుకున్న వాళ్లు సరైన సమయంలో రుణం తిరిగి చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతారు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి డబ్బు తిరిగి చెల్లించలేదని అతని భార్యను మీద వడ్డీ వ్యాపారి అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.

మహారాష్ట్రలోని పూణెలో వడ్డీ వ్యాపారి రుణం చెల్లించని వ్యక్తి భార్య మీద అత్యాచారం చేశాడు. ఇంతియాజ్ షేక్ (47) అనే వ్యక్తి బాధితురాలి భర్తకు వడ్డీ లేకుండా రూ. 40, 000 రుణం ఇచ్చాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఈ రుణం మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వడ్డీ వ్యాపారి పదేపదే పట్టుబట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల రుణం తీసుకున్న వక్తి డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయాడు.

A moneylender who raped the borrowers wife in Maharashtra.

వడ్డీ వ్యాపారి ఇంతియాజ్ షేక్ అతని అనుచరులతో కలిసి రుణం తీసుకున్న భార్యాభర్తలిద్దరినీ కిడ్నాప్ చేసి హడప్సర్‌లోని ఓ ఇంట్లో నిర్బంధించాడు. వడ్డీ వ్యాపారి షేక్ దంపతులు ఇద్దరినీ వేధించి కత్తితో చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకుంటే తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వడ్డీ వ్యాపారి ఇంతియాజ్ షేక్ అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను బెదిరించాడు.

రుణం తీసుకున్న వ్యక్తి భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నిరాకరించడంతో వడ్డీ వ్యాపారి షేక్ అప్పు తీసుకున్న వ్యక్తిని చంపేస్తానని కత్తితో బెదిరించాడు. గతంలో రుణగ్రహీత భార్యపై షేక్ అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా భార్యాభర్తలను బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఘటనపై ఇద్దరు బాధితులు మంగళవారం హడప్‌సర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు, వడ్డీ వ్యాపారి ఇంతియాజ్ షేక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రూ. 40 వేల అప్పు తీర్చలేక భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. కేవలం 40 వేల రూపాయల కోసం మహిళ మీద అత్యాచారం చేసి వీడియో తియ్యడంతో ప్రజలు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+