కూతుర్ని చంపేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, కోమాలో కొడుకు, భర్తను వదిలేసి?

బెంగళూరు/ విజయపుర: వివాహం చేసుకున్న దంపతులు (couple) సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యే సమయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. ఇదే సందర్బంలో ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు దంపతులకు సర్ది చెబుతూ రాజీలు చేస్తూ వచ్చారు. ఇలా చాలాకాలం పాటు దంపతులు కాపురం చేశారు.

రాజీ చేసిర కొన్ని రోజులు మామూలుగా ఉండే దంపతులు (couple)మళ్లీ గొడవలు పడటం మొదలుపెట్టారు. దంపతులకు రాజీ చేసిన పెద్దలు, బంధువులు, స్థానికులు విసిగిపోయి వారిని వదిలేశారు. కొంతకాలం తరువాత దంపతులు (couple)విడిపోయారు. పిల్లలతో కలిసి తల్లి ప్రత్యేకంగా నివాసం ఉంటోంది. భర్త కూడా అతని దారి అతను చూసుకుని నివాసం ఉంటున్నాడు.

A mother killed her daughter at home and committed suicide out of fear in Karnataka

చిన్న విషయమై గొడవపడిన తల్లి (mother) ఆమె ఇద్దరు పిల్లలను పెద్ద కర్రతో కొట్టడంతో కూతురు మృతి చెందింది. తల్లి (mother) దాడి చెయ్యడంతో కుమారుడు కోమాలోకి వెళ్లిపోయిన ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని హర్పనహళ్లి తాలూకాలోని హుల్లికట్టి గ్రామంలో చోటుచేసుకుంది. కూతురు చనిపోయిన అనంతరం తల్లి (mother) కూడాఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని పరపనహళ్లిలో ఓ తల్లి కిరాతకంగా దాడి చెయ్యడంతో షామనాబాను అలియాస్ (18) అనే యువతి హత్యకు గురి అయ్యిందని పోలీసులు అన్నారు. బానును హత్య చేసిన తల్లి (mother) బేగంబీ అలియాస్ బేగం (50) ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. తండ్రి దూరం అయిన తరువాత బేగం బీ ఆమె కుమారుడు, కుమార్తెను కష్టపడి పెంచిపోషిస్తున్నది.

అయితే కూతురు, కొడుకు చెప్పిన మాట వినడం లేదనే విషయమై రాత్రి ఇంట్లో ముగ్గురికి గొడవ జరిగింది. ఆ సమయంలో బేగంబీ పెద్ద కర్ర తీసుకుని ఆమె కుమార్తె (daughter) షామనాబాను, కుమారుడు (son)అమానుల్లాను కొట్టడంతొ గొడవ ఎక్కువ అయ్యింది. దీంతో పిల్లలిద్దరి తలపై తల్లి (mother) బేగంబీ కర్రతో కొట్టింది. ఈ ఘటనలో కూతురు బాను అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు అమానుల్లా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలు చనిపోయారని భావించిన బేగంబీ (mother) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అమానుల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+