కామాంధురాలు, ఇద్దరు పిల్లలు హత్య, బతికిపోయిన భర్త, ప్రియుడితో ఎస్కేప్: అరెస్టు!
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన మహిళ ఇద్దరు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. రాత్రి ఇంటికి వచ్చే భర్తను కూడా హత్య చెయ్యాలని నిర్ణయించింది. అయితే ఉద్యోగరీత్యా భర్త రాత్రి ఇంటికి రాకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. పిల్లలను హత్య చేసి ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది.

బ్యాంకు ఉద్యోగి
చెన్నై నగరంలోని కున్ దరతూర్ ప్రాంతంలో విజయ్, అభిరామి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అజయ్ అనే కుమారుడు, కార్తిక అనే కుమార్తె ఉన్నారు. చెన్నైలోని ప్రముఖ బ్యాంకులో విజయ్ ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లలను పోషిస్తున్నాడు.

షికార్లు తిరిగింది
భర్త విజయ్ ఉద్యోగానికి, పిల్లుల అజయ్, కార్తిక స్కూల్ కు వెళ్లిన తరువాత అభిరామి షికార్లు తిరగడం మొదలు పెట్టింది. అభిరామి షికార్లు తిరుగుతున్న సమయంలో సుందరం అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

అక్రమ సంబంధం
బిరియాని సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న సుందరంతో అభిరామి అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త, పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత ప్రియుడు సుందరంను ఇంటికి పిలిపించుకుంటున్న అభిరామి రాసలీలలు సాగించింది.

వార్నింగ్ ఇచ్చిన భర్త
విజయ్ ఉద్యోగానికి, పిల్లలు స్కూల్ కు వెళ్లిన తరువాత అభిరామి ఇంటికి ఎవరో వ్యక్తి నిత్యం వస్తున్నాడని చుట్టుపక్కల వారు గమనించారు. ఈ విషయాన్ని ఇటీవల తెలిసిన వాళ్లు విజయ్ కు చెప్పారు. పిల్లలు ఉన్నారని, పరువు పోతుందని, అక్రమ సంబంధం మానుకోవాలని విజయ్ భార్య అభిరామికి వార్నింగ్ ఇచ్చాడు.

మాస్టర్ ప్లాన్ వేసింది
భర్త, పిల్లలు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని, వారిని హత్య చేసి ఇంటిలో ఉన్న నగలు, నగదు తీసుకుని పారిపోవాలని అభిరామి ప్లాన్ వేసింది. ఈ విషయం అభిరామి ప్రియుడు సుందరంకు చెప్పింది. ప్రియురాలి భర్త, పిల్లలను హత్య చెయ్యడానికి సుందరం విషం తీసుకుని వచ్చి అభిరామికి ఇచ్చాడు.

పిల్లలు హత్య, భర్త ఎస్కేప్
ప్రతి రోజు విజయ్ ఇంటికి వచ్చిన వెంటనే టీ తాగడం అలవాటు. శుక్రవారం రాత్రి అభిరామి టీలో విషం కలిపి కుమారుడు అజయ్, కుమార్తె కార్తికకు ఇచ్చింది. భర్త ఇంటికి వస్తే విషం కలిపిన టీ ఇవ్వాలని అభిరామి వేచి చూసింది. తరువాత విజయ్ భార్య అభిరామికి ఫోన్ చేసి బ్యాంకులో పని ఎక్కువగా ఉందని తాను రాత్రి ఇంటికి రాలేనని చెప్పాడు.

ప్రియుడితో పరార్
భర్త విజయ్ ఇంటికి రాడని తెలుసుకున్న అభిరామి ఇద్దరు పిల్లలు చనిపోయారని నిర్దారించుకుని ఇంటిలో ఉన్న నగలు, నగదు తీసుకుని ప్రియుడు సుందరంతో కలిసి సమీపంలోని బస్ స్టాండ్ చేరుకుని చెన్నై నుంచి పారిపోయింది. శనివారం ఇంటికి వెళ్లిన విజయ్ ఇద్దరు పిల్లలు చనిపోయిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గంటల్లో కామాంధురాలు అరెస్టు
పోలీసులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించి పిల్లల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. విజయ్ ఇచ్చిన సమాచారంతో అభిరామి మొబైల్ నెంబర్ ట్రేస్ చేసిన పోలీసులు ఆమెను కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు.

నేనే హత్య చేశాను
తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఇద్దరు పిల్లలకు విషం పెట్టి హత్య చేశానని అభిరామి విచారణలో అంగీకరించిందని పోలీసులు అన్నారు. తన భర్త విజయ్ ని కూడా హత్య చెయ్యాలని ప్లాన్ వేశానని, అతను రాత్రి ఇంటికి రాలేదని అభిరామి అంగీకరించిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. కామాంధురాలు అభిరామి బరి తెగించి చేసిన పనికి కున్ దరతూర్ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications