కేజ్రీ క్రేజీ: అప్పుడు తిట్టి, ఇప్పుడు కౌగిలింత(ఫొటోలు)
పాట్నా: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిరూపించారు. గతంలో గడ్డి కుంభకోణంలో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టిన విషయం తెలిసిందే.
5) अपनी पुरानी ओजस्वी बातों पर मिट्टी डालना भी आना चाहिये।
pic.twitter.com/G8rTNnqQ5q
— Sunil Bond 0036 (@1sInto2s) November 20, 2015 ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ అదే లాలూ ప్రసాద్ యాదవ్‌ను చిరునవ్వులు చిందిస్తూ కౌగిలించుకున్నారు. శుక్రవారం బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగానే అరవింద్ కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ కౌగిలించుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు.
लालू द्वारा खाये हुये चारे कि जाँच करते श्री अरविंद केजरीवाल।
pic.twitter.com/IbXoeRrHD2
— Sunil Bond 0036 (@1sInto2s) November 20, 2015 కాంగ్రెస్ అవినీతిపై పోరాటం చేస్తామంటూ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు వారి కూటమికే మద్దతివ్వడం గమనార్హం.
Rang de tu mohe gerua pic.twitter.com/d9nJIjQhZ7
— Akshar (@AksharPathak) November 20, 2015 బీహార్ ఎన్నికల ముందే కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీల మహా కూటమికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. లాలూ పేరు ప్రస్తావించనప్పటికీ నితీష్‌కే ఓటు వేయాలని అరవింద్ కేజ్రివాల్ బీహార్ ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications