వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూతులు తిడుతున్న చిలుక: కేసు, సమన్లు

|
Google Oneindia TeluguNews

పూణే: యజమాని చెప్పినట్లు పక్కింటిలో నివాసం ఉంటున్న వృద్దురాలిని బండ బూతులు తిడుతున్నచిలుక మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అశ్చర్యం కలిగినా ఇది నిజం. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో చిలుక మీద కేసు నమోదు చేశారు.

చంద్రాపూర్ లోని జనాబాయి సకార్కర్ (85)వృద్దురాలు నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంతంలో జనాబాయి సవతి కుమారుడు సురేష్ నివాసం ఉంటున్నారు. ఆస్తి విషయంలో ఇద్దరి మద్య విభేదాలు రావడంతో వేరువేరుగా నివాసం ఉంటున్నారు.

ఒకరిని చూస్తే ఒకరికి కాదు. కొన్ని నెలల క్రితం సురేష్ ఒక చిలుకను కొనుగోలు చేశాడు. అప్పటికే ఆ చిలుకకు కొన్ని మాటలువచ్చు. చిలుకకు హరియాల్ అనే పేరు పెట్టాడు. చిలుకను ఇంటికి తీసుకు వెళ్లిన సురేష్ దానికి మాటలు నేర్పడం మొదలు పెట్టాడు. సురేష్ తో చిలుక నిత్యం మాట్లాడేది.

A parrot accused of

సురేష్ ఇంటికి ఎవరు వెళ్లినా పలకరించేది. ఇదే సమయంలో తన చిన్నమ్మ ఫోటో చూపించి సురేష్ బండ బూతులు తిట్టేవాడు. పనిలో పనిగా చిలుక బూతులు తిట్టడం నేర్చుకునింది. సురేష్ ఫోటో చూపించి బూతులు తిడితే చిలుక ఆమెను చూసి బూతులు తిట్టేది.

అయితే జనాబాయిని చూస్తే చిలుక తిట్లపురాణం మొదలు పెడుతుంది. బూతులు అంటే మామూలుగా కాదు బండ బూతులు తిట్టేది. కొన్ని నెలల పాటు సహనంతో ఉన్న జనాబాయి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణకు హాజరుకావాలని సురేష్, చిలుకకు సమన్లు జారీ చేశారు. అదే విధంగా సోమవారం జనాబాయిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. సురేష్ చిలుకను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అప్పటికే అక్కడ జనాబాయి ఉన్నారు.

పోలీసులు చిలుకను టేబుల్ మీద పెట్టమని చెప్పారు. ఎదురుగా జనాబాయిని కుర్చోబెట్టారు. అయితే ఆమెను చూసిన చిలుక ఏమి మాట్లాడలేదు. బిక్కముఖం వేసుకుని అటు ఇటు చూసింది. చివరికి పోలీసులు తాము విచారణ చేస్తామని చెప్పి సురేష్, జనాబాయిని పంపించారు.

బయటకు వెళ్లిన వెంటనే చిలుక జనాబాయిని చూసి తిట్ల పురాణం మొదలు పెట్టింది. పోలీసులు షాక్ కు గురైనారు. చిలుక యజమాని సురేష్ పోలీసు దుస్తులు వేసుకున్న ఫోటోలు చూపించి ఈ వ్యక్తులు కనపడిన సమయంలో నోరు మెదపరాదని సూచించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచాణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
The police was at its wit's end after 85-year-old Janabai Sakharkar accused her stepson Suresh of teaching his parrot 'Hariyal', to shower abuses at her whenever she passed by his house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X