బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం పెత్తనం ఏమిటి, చేతులు కట్టుకోవాలా, కావేరి, ప్రజాస్వామ్యం, ప్రకాష్ రాజ్ ఫైర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నైల్ నదిని రెండు దేశాలు పంచుకున్నప్పుడు కావేరి నదిని రెండు రాష్ట్రాలు పంచుకోవడానికి ఎందుకు వీలు కావడంలేదని బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. అన్నదమ్ములు లాగా ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కుర్చుని సామరస్యంగా చర్చించుకుంటే కావేరి నీరు పంపిణి విషయంలో ఎలాంటి సమస్యలురావని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం బెంగళూరు ప్రెస్ క్లబ్ లో ప్రకాష్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏమిటని మండిపడ్డారు.

ఓ ప్రముఖ పార్టీ

ఓ ప్రముఖ పార్టీ

ఓ ప్రముఖ పార్టీ ప్రతిపక్షాలే లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రతిపక్షం లేకుంటే ప్రజల సమస్యల గురించి అడిగేవారు ఎవరుంటారని, ప్రజాప్రభుత్వాన్ని కూనీ చెయ్యడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు.

సర్వాధికారం అంటే ఎలా !

సర్వాధికారం అంటే ఎలా !

ఏకపక్షంగా అధికారంలో ఉండి సర్వాధికారం చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇదే సమయంలో తాను ప్రశ్నించాల్సి వచ్చిందని, ప్రశ్నించే హక్కు తనకు ఉందని, సమాధానం చెప్పాల్సిన భాద్యత ప్రజాప్రతినిధులకు ఉండాలని ప్రకాష్ రాజ్ అన్నారు.

నేను రాజకీయాల్లోకి రాను

నేను రాజకీయాల్లోకి రాను

జస్ట్ ఆస్కింగ్ కేవలం రాజకీయాలకు మాత్రమే కాదు, జస్ట్ ఆస్కింగ్ అంటే రాజకీయాల్లోకి వస్తానని కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడిగే ప్రశ్న మాత్రమే అని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తల మీద ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు.

వాజ్ పేయి వీరాభిమాని

వాజ్ పేయి వీరాభిమాని

తాను అటల్ బిహారీ వాజ్ పేయి వీరాభిమానిని అని ప్రకాష్ రాజ్ చెప్పారు. అయితే బీజేపీని తాను సమర్థించనని. ఆ పార్టీ దేశానికి ఏం చేసిందని ప్రకాష్ రాజ్ ప్రశ్రించారు. తాను బీజేపీనే కాదు మతతత్వ పార్టీలు అన్నింటిని వ్యతిరేకిస్తానని, మాజీ ప్రధాని దేవేగౌడ బీజేపీతో కలిసి జేడీఎస్ వెళ్లదని హామీ ఇచ్చారని ప్రకాష్ రాజ్ వివరించారు.

కేంద్రం పెత్తనం ఏమిటి !

కేంద్రం పెత్తనం ఏమిటి !

ప్రతి విషయానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందు చేతులుకట్టుకుని నిలబడాలని ప్రకాష్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని శాశించాలని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ప్రశ్నించడం కొందరికి రుచించడం లేదని ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులను ఎద్దేవ చేశారు.

నాకు ఎన్నికల కోడ్ !

నాకు ఎన్నికల కోడ్ !

ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్న తనకు ఎన్నికల కోడ్ అంటున్నారని, తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని, అలాంటి సందర్బంలో తనకు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందని ప్రకాష్ రాజ్ అన్నారు. కులబరిగిలో రక్షణ లేని సమయంలో తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారని, చేతిలో రాళ్లు పట్టుకున్నారని ప్రకాష్ రాజ్ విచారం వ్యక్తం చేశారు.

సినిమాలు లేకపోయినా పర్వాలేదు

సినిమాలు లేకపోయినా పర్వాలేదు

తాను ప్రస్తుతం 12 సినిమాల్లో నటిస్తున్నానని ప్రకాష్ రాజ్ అన్నారు. సినిమాలు లేకపోయినా పర్వాలేదని, తాను రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదని, ఎమ్మెల్యే కావాలనే కోరిక లేదని ప్రకాష్ రాజ్ చెప్పారు. పనిలో పనిగా బీజేపీ నాయకుల పేర్లు చెప్పకుండా వారి మీద ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

English summary
Actor Prakash Raj said that, a particular party is trying to ruin the democracy. Some people trying to suppress the people who question them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X