Air India: ఎయిరిండియా అధికారిపై ప్రయాణికుడి దాడి..
ఇటీవల కాలంలో విమాన సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేయడం సాధారణమైంది. తాజాగా ఎయిరిండియా అధికారిపై ఓ ప్రయాణికుడు చేయి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి ఢిల్లీ విస్తున్న విమానంలో ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ప్రయాణిస్తున్నారు. అయితే ఆయనకు బిజినెస్ క్లాస్ సీట్ కంఫర్ట్ లేకపోవడంతో ఎకానమీ క్లాస్ లోకి వెళ్లాడు. అక్కడ పక్క సీట్లో కూర్చిన ప్రయాణికుడు బిగ్గరగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారని.. కాస్త మెల్లగా మాట్లాడాలని సూచించాడు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అతను దుర్భాషలాడి దాడికి పాల్పడ్డాడు. చెంపపై కొట్టాడు. మెడను తిప్పే ప్రయత్నం చేశాడు. దీంతో సిబ్బంది వచ్చి అతడిని వారించారు. ఢిల్లీలో దిగగానే నిందితుడిని భద్రత సిబ్బందకి అప్పగించారు. "జులై 9న సిడ్నీ నుండి ఢిల్లీకి నడిచే AI301 (విమానం)లో ఉన్న ఒక ప్రయాణికుడు విమానంలో మౌఖిక, వ్రాతపూర్వక హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆమోదయోగ్యం కాని రీతిలో ప్రవర్తించాడు. ఇది మా సిబ్బందితో సహా ఇతర ప్రయాణీకులకు బాధ కలిగించింది" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.

అయితే ప్రయాణికుడు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఎయిర్ ఇండియా ఈ సంఘటన గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి తెలియజేసింది. ఎయిర్ ఇండియా అధికారికి మొదట 30-C సీటు కేటాయించారు. ఆ సీటు బాగా లేకపోవడంతో 25 ABCకి సీటుకు వెళ్లారు. ఆ తర్వాత ఈ గొడవ జరిగింది. కొద్ది రోజుల క్రితం నేపాల్ కు చెందిన ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో లాట్రిన్ డోర్లు పగలగొట్టిన సంగతి తెలిసింది.
టొరంటో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఎయిర్ ఇండియా ఓ వ్యక్తి సిబ్బందిని దుర్భాషలాడడంతో లావెటరీ డోర్‌ను పగులగొట్టాడు. దీంతో నేపాల్ కు చెందిన అతడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి పేరు మహేష్ పండిట్‌గా గుర్తించారు. మహేష్ విమానంలో సీటును మార్చుకున్నాడు. దీంతో గొడవ ప్రారంభం అయింది. అతనికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆగిపోయాడని బాధిత క్యాబిన్ సూపర్‌వైజర్ ఆదిత్య కుమార్ తెలిపారు. అయితే, కొంతసేపటి తర్వాత అతను లావేటరీ స్మోక్ చేశాడని చెప్పాడు. అంతే కాదు తర్వాత ప్రయాణీకుడు లావేటరీ డోర్లు పగలగొట్టాడని చెప్పాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications