అపోలో ఆసుపత్రికి బాంబు బెదిరింపు: జయ ఎఫెక్ట్
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిలో బాంబు పెట్టామని, పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం బెదిరించారు. విషయం తెలుసుకున్న అపోలో ఆసుపత్రి యాజమాన్యం షాక్ కు గురైయ్యింది.

వెంటనే విషయం తెలుసుకున్న బాంబు స్కాడ్ సిబ్బంది, పోలీసు అధికారులు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అపోలో ఆసుపత్రి ఆవరణంలో ప్రతి అణువు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి బాంబు కనపడకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత 74 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు.చివరికి ఆమె మరణించారని సోమవారం రాత్రి అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. జయలలిత విషయంలో అపోలో ఆసుపత్రి ఇలా పొంతనలేని సమాధానం చెప్పారని ఆరోపిస్తూ బాంబు బెదిరింపులు చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications