రెచ్చిపోయిన ఇసుక మాఫియా: కానిస్టేబుల్ హత్య
బెంగళూరు: ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు గాలిలో కలిసి పోయిన సంఘటన మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లాలో జరిగింది. నూరాబాద్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ధర్మేంద్ర సింగ్ చౌహాన్ ఆదివారం హత్యకు గురయ్యారు.
రిటైడ్ మిలటరి అధికారి అయిన ధర్మేంద్ర సింగ్ చౌహాన్ రెండు సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరారు. ఈయన ఇసుక మాఫియాపై నిఘా వేశారు. ఇసుక మాఫియా విషయంలో ధర్మేంద్రకు ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉంది.
ఆదివారం ధర్మేంద్ర సింగ్ చౌహాన్ ధానేలా అనే గ్రామం దగ్గర చంబల్ నది తీరం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే ఆయన చంబల్ నది తీరం దగ్గరకు వెళ్లారు. అక్రమంగా ఇసుక తీసుకు వెళ్తున్న ట్రక్ కు అడ్డంగా నిలబడ్డారు. వెంటనే ట్రక్ ను రోడ్డు పక్కన నిలపాలని డ్రైవర్ కు చెప్పాడు.

ఆ సమయంలో ట్రక్ డ్రైవర్ అక్కడి నుండి వాహనంతో సహ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బలో ధర్మేంద్ర సింగ్ చౌహాన్ మీద వాహనం నడిపాడు. ట్రక్ చక్రాల కింద నలిగిపోయిన ధర్మేంద్ర సింగ్ చౌహాన్ సంఘటనా స్థలంలో ప్రాణాలు వదిలారు.
డ్రైవర్ ట్రక్ ను అక్కడే వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ధర్మేంద్ర సింగ్ చౌహాన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ట్రక్ నెంబర్ ఆధారంగా డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇసుక మాఫియా నాయకులు రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారు.
2012వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డు కోవడానికి వెళ్లిన ఎస్ఐ నరేంద్ర కుమార్ ను ఇదే విధంగా ట్రక్ తో తొక్కించి దారుణంగా హత్య చేశారు.












Click it and Unblock the Notifications