ఎ పొలిటికల్ లవ్ స్టోరీ: సబ్ కలెక్టర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాహం, ఇప్పుడిదే హాట్ గురూ!

కేర‌ళ‌లో ఎమ్మెల్యేతో సబ్ కలెక్టర్ వివాహం హాట్ టాపిక్ గా మారింది. అరువిక్క‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే శ‌బ‌రినాథ‌న్ తాను తిరువ‌నంత‌పురం స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య నాయ‌ర్ ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఫేస్ బుక్

తిరువనంతపురం: కేర‌ళ‌లో ఎమ్మెల్యేతో సబ్ కలెక్టర్ వివాహం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని అరువిక్క‌ర నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే శ‌బ‌రినాథ‌న్, తాను తిరువ‌నంత‌పురం స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య అయ్యర్ ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఫేస్ బుక్ ద్వారా వెల్ల‌డించారు. ఈ మేరకు శబరినాథన్ తామిద్దరూ క‌లిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన ప్రేమ గురించి ఆయన వివరించారు.

తిరువ‌నంత‌పురంలో మొద‌టిసారి దివ్య‌ను క‌లిశాన‌ని, అప్పుడే త‌మ ఇద్ద‌రి ఆలోచ‌న‌లు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు తెలిసింద‌ని, ఆ స‌మ‌యంలోనే త‌న మ‌న‌సులో మాట‌ను దివ్య‌తో చెప్పాన‌ని ఎమ్మెల్యే శబరినాథన్ పేర్కొన్నారు. తమ పెళ్లికి రెండు కుటుంబాలు కూడా ప‌చ్చజెండా ఊపాయని, త్వరలోనే స‌బ్ క‌లెక్ట‌ర్ ను వివాహమాడనున్నానని ఆయన చెప్పారు.

A political love story: Kerala MLA to marry IAS officer

కేరళ మాజీ స్పీకర్ కుమారుడైన శబరినాథన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్... తండ్రి మ‌రణానంత‌రం రాజకీయాల్లోకి వ‌చ్చారు. తిరువ‌నంత‌పురంలోని అరువిక్క‌ర నియోక‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ తరపున 2015లో పోటీ చేసి గెలిచారు.

స‌బ్ క‌లెక్ట‌ర్ దివ్య...2016 ఎన్నిక‌ల సంద‌ర్భంగా విధుల్లో భాగంగా ఒక ప్రచార వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో పాటను రాసి, ఆలపించింది కూడా ఆమె కావడంతో...ఆ వీడియో కేర‌ళలో దివ్య అయ్యర్ కు విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+