23 మందిని రేప్ చేసిన వికృత కామాంధుడు: ఆ వయసు వారే వీడి టార్గెట్!
బెంగళూరు: వృద్దులు, వయసు ఎక్కువ ఉన్న మహిళ మీద అత్యాచారం చేసి మాయం అవుతున్న వికృత కామాంధుడిని కర్ణాటకలోని విజయపుర పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నాయకోడి అనే కామాంధుడిని అరెస్టు చేశామని గురువారం విజయపుర పోలీసులు చెప్పారు.
అశోక్ ఇప్పటి వరకు 23 మంది మహిళల మీద అత్యాచారం చేశాడని పోలీసులు అంటున్నారు. కళ్లు సరిగా కనపడిన వృద్దుల మీదే అశోక్ ఎక్కువ అత్యాచారాలు చేశాడని పోలీసులు చెప్పారు. వయసు ఎక్కువ అయిన మహిళలనే ఇతను టార్గెట్ చేసుకుంటున్నాడని పోలీసులు అన్నారు.

మాజీ పోలీసు, వికృత కామాంధుడు ఉమేష్ రెడ్డి కంటే ఇతను చాల ప్రమాదకరం అని పోలీసులు చెప్పారు. వృద్దుల మీద అత్యాచారం చేసిన తరువాత ఇంటిలో ఉన్న బంగారు నగలు, నగదు లూటీ చేసి పారిపోతున్నాడని పోలీసులు అన్నారు. ఇంత కాలం తప్పించుకు తిరుగుతున్న అశోక్ ను అరెస్టు చేశామని, ఇతను ఇంకా ఎంత మందిని అత్యాచారం చేశాడు అని ఆరా తీస్తున్నామని విజయపుర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications