relative: బంధువు ప్రాణం తీసిన మొబైల్ ఫోన్ సిమ్ కార్డు, అందులో ఏముంది ?, అర్దరాత్రి పక్కాప్లాన్ తో ?
మొబైల్ సిమ్ కార్డు విషయంలో ఓ యువకుడితో అతని బంధువు గొడవపడ్డాడు. తరువాత అదే రోజు అర్దరాత్రి మొబైల్ సిమ్ కార్డు కోసం సాటి బంధువు చేతిలో ఓ యువకుడు హత్యకు గురైనాడు.
బెంగళూరు/కలబురిగి: ఒకే వయసులో ఉన్న ఇద్దరు యువకులు చాలా దగ్గర బంధువులు. ప్రతిరోజు కలుస్తున్న యువకులు మద్యం సేవిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరిపనులు వాళ్లు చేసుకుంటున్నారు. రాత్రిపూట ఇద్దరు ప్రభుత్వ స్కూల్ సమీపంలోని నిర్జనప్రదేశంలో కుర్చుని మద్యం సేవిస్తున్నాడు. మొబైల్ సిమ్ కార్డు విషయంలో ఓ యువకుడితో అతని బంధువు గొడవపడ్డాడు. తరువాత అదే రోజు అర్దరాత్రి మొబైల్ సిమ్ కార్డు కోసం సాటి బంధువు చేతిలో ఓ యువకుడు హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

అర్దరాత్రి బంధువు హత్య
అర్దరాత్రి నిద్రిపోతున్న యువకుడి తలపై బండారాయి వేసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలోని కమల్‌పురా తాలూకాలోని కలమందర్గి గ్రామంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన యువకుడి పేరు భరత్ సుభాష్ చంద్రా(24) అని పోలీసులు అన్నారు. భరత్ చంద్రాను అతని సమీప బంధువు మల్లికార్జున శివశరణప్ప అలియాస్ మల్లికార్జున హత్య చేసి పరారయ్యాడని భరత్ తల్లి బంగారమ్మ కమల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మొబైల్ లో సిమ్ కార్డు బయటకు తీసి ?
భరత్ అతని బంధువు మల్లికార్జున మొబైల్‌లోని సిమ్‌కార్డు బయటకు తీశాడు. తరువాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సిమ్ కార్డు నేల మీద పెట్టి రాయితో సిమ్ కార్డు మీద కొట్టడంతో ఆ సిమ్ కార్డు పని చెయ్యకుండా పోయింది. సిమ్ కార్డు మొబైల్ లో వేసిన మల్లికార్జున ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో సిమ్ కార్డు పని చెయ్యలేదని తెలుసుకున్నాడు.

ఈరోజు నీకు లాస్ట్ డే
అప్పటికే మద్యం మత్తులో ఉన్న మల్లికార్జున అతని బంధువు భరత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో స్థానిక ప్రజలు ఇద్దరికి బుద్దిమాటలు చెప్పి అక్కడి నుంచి వాళ్లవాళ్ల ఇళ్లకు పంపించారు. ఆ సమయంలో ఈరోజు మాత్రమే నువ్వు బతికుంటావు, రేపు నువ్వు ప్రాణాలతో ఉండవు అని గట్టిగా కేకలు వేశాడు నేను నిన్ను కచ్చితంగా చంపేస్తా' అని మల్లికార్జున అరిచాడని గ్రామస్తులు అంటున్నారు.

తల్లి చెప్పినా మాట వినలేదు
తరువాత మద్యం మత్తులో ఉన్న భరత్ అతని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే విషయం తెలుసుకున్న తల్లి రోడ్డు మీదకు వెళ్లి భరత్‌ని ఇంటికి పిలుచుకుని వెళ్లి భోజనం చేసి ఇక్కడే నిద్రపోవాలని చెప్పింది. అయితే భోజనం చేసిన భరత్ తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని తల్లికి చెప్పి ఎప్పటిలాగే ప్రభుత్వ స్కూల్ భవనంపైకి వెళ్లి నిద్రపోయాడు.

ప్రాణం తీసిన సిమ్ కార్డు పంచాయితి
అర్దరాత్రి దాటిన తరువాత మల్లికార్జున స్కూల్ భవనం మీదకు వెళ్లి బాగా నిద్రపోతున్న భరత్ తల మీద బండరాయి వెయ్యడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భరత్ ను హత్య చేసిన మల్లికార్జున అక్కడి నుంచి పరారైనాడు. మొబైల్ సిమ్ కార్డు కోసం ఓ యువకుడు అతని బంధువు చేతిలోనే హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications