రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూతురిపై సొంత మరిది రేప్

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి, అనేక క్లిష్టమైన సమస్యలు పరిష్కరించి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి కుటుంబంలో దారుణం జరిగింది. ఆయన కుమార్తె మీద అత్యాచారం చేశారు. 8 నెలల గర్బిణి అని చూడకుండా సొంత మరిది ఈ దారుణానికి పాల్పడ్డాడు.

బెంగళూరులో నివాసం ఉంటున్న ఐఏఎస్ అధికారి 2011లో రిటైర్ అయ్యారు. ఈయన పుట్టుకతోనే శ్రీమంతుడు. ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఒక కుమార్తె ఉన్నారు. మైసూరుకు చెందిన వ్యాపారవేత్తతో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో వైభవంగా వివాహం జరిపించారు.

ఆ సందర్బంలో కోట్ల రూపాయలు కట్నకానుకలుగా ఇచ్చారు. దంపతులు మైసూరులోనే నివాసం ఉంటున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆమెను పుట్టింటికి వెళ్లి రూ. 45 కోట్లు తీసుకురావాలని వేధించారు. ఆమె వరకట్నం తీసుకు వచ్చి ఇవ్వడానికి నిరాకరించారు.

అప్పటి నుండి ఆమెకు వేదింపులు మొదలైనాయి. చివరికి విషయం తెలుసుకున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తన కుమార్తె జీవితం బాగుండాలని భావించి బెంగళూరులోని ఒక ఇల్లు, ఇంటి స్థలం విక్రయించి రూ. 15 కోట్లు అల్లుడికి ఇచ్చారు. అయితే వారి ఆశకు హద్దే లేకుండా పోయింది.

ప్రస్తుతం ఆయన కుమార్తె 8 నెలల గర్బవతి. ఇంటిలో ఎవరు లేని సమయంలో వరకట్నం ఎందుకు తీసుకురాలేదని మరిది ఆమెను నిలదీశాడు. తరువాత ఆమె మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం జరగడంతో పురిటి నోప్పులు ఎక్కవ అయ్యాయి.

A retired IAS officer's daughter raped by brother in law

ఇంటికి వెళ్లిన ఆమె అత్త, మామ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరికి ఎక్కడ లేనిపోని సమస్య వస్తుందో అని ఆమెను తీసుకు వెళ్లి ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యతో కలిసి కుమార్తెను చూడటానికి మైసూరు వెళ్లారు.

ఆసుపత్రిలో ఉన్న బాధితురాలు తన మీద మరిది అత్యాచారం చేశాడని తల్లి దగ్గర విలపించింది. వెంటనే ఆమెను బెంగళూరు తీసుకు వచ్చారు.తరువాత బెంగళూరు తూర్పు విభాగం డీసీపీ ఎన్. సంతోష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

అత్యాచారం, వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి మైసూరుకు బదిలి చేశామని శుక్రవారం డీసీపీ సంతోష్ కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త, అత్త, మామ, మరిది మాయమయ్యారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+