girls: అక్కాచెల్లెళ్లు, కామంతో ముగ్గురు మైనర్ల మీద లైంగిక దాడి చేసిన పక్కింటోడు !

ముంబాయి: ముంబైలోని జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ముగ్గురు మైనర్ అమ్మాయిలపై లైంగిక దాడి చేసిన ఆరోపణలపై ఎంబ్రాయిడరీ పని చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన ఏడేళ్ల కూతురు ఆమెకు జరిగిన ఘోరాన్ని వివరించడంతో బాధితురాలి తల్లి జేజే మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని ముంబాయి సౌత్ జోన్ అడిషనల్ పోలీసు కమీషనర్ దిలీప్ సావంత్ మీడియాకు చెప్పారు. నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సావంత్ బాధితురాలి తల్లికి హామీ ఇచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న 43 ఏళ్ల ఎంబ్రాయిడరీ కార్మికుడు అతని ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న ఏడు. ఐదు. నాలుగు సంవత్సరాల వయసు ఉన్న అక్కచెల్లెళ్లను అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. తినడానికి ఏమైనా ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలుచుకుని వెళ్లి ముగ్గురి మీద లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

A sadist who sexually assaulted three minor girls in Mumbai. Three minor girls own sisters.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం నిందితుడు పిల్లలను అనుచితంగా ఎక్కడంటే అక్కడ తాకి అసభ్యంగా ప్రవర్తించాడని, ముగ్గురు అమ్మాయిల పెదవులపై ముద్దులు పెట్టాడని, ఇద్దరు అమ్మాయిలను వివస్త్రను చేసి వారి ప్రైవేట్ భాగాలను తాకినట్లు పిల్లల తల్లి తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసు అధికారులు తెలిపారు ఈ జరిగిన సంఘటన పెద్ద కుమార్తె ఆమె తల్లికి చెప్పడంతో విషయం బటయకు వచ్చిందని పోలీసులు తెలిపారు.

మైనర్ అమ్మాయిల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిసిన వెంటనే కామాంధుడు పారిపోయాడు. జేజే మార్గ్ పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నేరం తాను చేశానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. సాక్ష్యాలను సేకరించేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక అధికారి తెలిపారు. ఇది తీవ్రమైన నేరమని, నిందితుడిపై చార్జిషీటు దాఖలు చేసి ఏడు రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని, నిందితుడికి గరిష్ట శిక్ష విధించేందుకు కృషి చేస్తామని సీనియర్ పోలీసు అధికారి సావంత్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+