మూడేళ్ల దత్తపుత్రిక ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరేట్లతో కాల్చిన శాడిస్టు డాక్టర్ దంపతులు !
గౌహతి/అసోం: డాక్టర్లు గా పని చేస్తున్న ఇద్దరి మతాలు వేరుకావడంతో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. డాక్టర్లు గా పని చేస్తున్న దంపతులు మూడు ఏళ్ల కవల పిల్లలను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద డాక్టర్ దంపతులు సిగరేట్లతో కాల్చి ఆ అమ్మాయిని అపార్ట్ మెంట్ నుంచి బయటకు లాగేయడం కలకలం రేపింది.
స్వయంగా సీఎంతో పాటు డీజీపీ కూడా ఈ కేసు విషయంలో రంగంలోకి దిగారంటే ఈ డాక్టర్ దంపతుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసోంలోని గుహవాటి (గౌహతి)లోని రోమ్ ఎన్ క్లేవ్ లో డాక్టర్ సంగీతా దత్తా, డాక్టర్ వలియుల్ ఇస్లాం దంపతులు నివాసం ఉంటున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులకు పిల్లలు లేరని సమాచారం.

మూడు సంవత్సరాల వయసు ఉన్న కవల పిల్లలు( ఓ అమ్మాయి, ఓ అబ్బాయి)ని దత్తత తీసుకున్నారు. కవలల పిల్లలతో కలిసి అపార్ట్ మెంట్ లో ఉంటున్న డాక్టర్ సంగీతా దత్తా, డాక్టర్ ఇస్లాం దంపతులు ఇటీవల కాలంలో దత్తత తీసుకున్న ఇద్దరు పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
మూడు సంవత్సరాల దత్తపుత్రిక ప్రైవేట్ పార్ట్స్ మీద డాక్టర్ ఇస్లాం సిగరేట్లతో కాల్చాడని, ఆమె శరీరం మీద సిగరేట్ తో కాల్చిన గాయాలు చాలా ఉన్నాయని వెలుగు చూసింది. దత్త పుత్రికను అపార్ట్ మెంట్ లో నుంచి బయటకు తరిమేయడంతో రోడ్డు మీద కుర్చున్న అమ్మాయిని కొందరు పలకరించి వివరాలు సేకరించగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
విషయం తెలుసుకున్న గుహవాటి సిటీ పోలీసు కమీషనర్ దిగంత్ ఒరాహా రంగంలోకి దిగారు. మూడేళ్ల చిన్నారని చిత్రహింసలకు గురి చేశారని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి డాక్టర్ సంగీతా దత్తా, డాక్టర్ ఇస్లాం దంపతులను అరెస్టు చేసి వారిని విచారణ చేస్తున్నామని గుహవాటి సిటీ పోలీసు కమీషనర్ దిగంత్ ఒరాహా స్థానిక మీడియాకు చెప్పారు.

మూడేళ్ల అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా డాక్టర్ దంపతులు చిత్రహింసలకు గురి చేశారని వెలుగు చూసిందని, కవల పిల్లలను గుహవాటి మెడికల్ కాలేజ్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని, వైద్య నివేదిక వచ్చిన తరువాత వాస్తవాలు అన్ని బయటకు వస్తాయని, అసలు శాడిస్టు దంపతులు ఎందుకు కవలపిల్లలను దత్తత తీసుకున్నారు ?, తరువాత ఏం జరిగింది అని ఆరా తీస్తున్నామని గుహవాటి సిటీ పోలీసు కమీషనర్ దిగంత్ ఒరాహా స్థానిక మీడియాకు చెప్పారు.
విషయం తెలుసుకున్న అసోం ముఖ్యమంత్రి, డీజీపీ జిపి సింగ్ ఈ కేసులో సీరియస్ గా తీసుకుని నిందితులను వదిలిపెట్టకుండా చూడటనికి ప్రత్యేక ప్రాసిక్యూటర్ ను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. తాను స్వయంగా కేసు దర్యాప్తు పరిశీలిస్తున్నానని గుహవాటి సిటీ పోలీసు కమీషనర్ దిగంత్ ఒరాహా స్థానిక మీడియాకు చెప్పారు. ఈ సంఘటన అసోంలో కలకలం రేపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications