Wife: భార్యతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉరి వేసుకున్న బ్యాంక్ అధికారి, అక్రమ సంబంధం దెబ్బతో !
రాత్రి భార్యకు వీడియో కాల్ చేసిన భర్త ఆమెతో మాట్లాడుతూ ఉరి వేసుకున్నాడు. భర్త వీడియో కాల్ లోనే ఉరి వేసుకోవడంతో అతని భార్య హడలిపోయింది. పోలీసులు వెళ్లి బ్యాంక్ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించినా అతను చనిపోయాడు.
కోల్ కత్తా/అహమ్మదాబాద్: బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్తకు వేరే రాష్ట్రంలోని బ్రాంచ్ కు బదిలి అయ్యింది. భర్త వేరే రాష్ట్రానికి వెళ్లిబ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య, పిల్లలు మరో రాష్ట్రంలో ఉన్నారు. రాత్రి భార్యకు వీడియో కాల్ చేసిన భర్త ఆమెతో మాట్లాడుతూ ఉరి వేసుకున్నాడు. భర్త వీడియో కాల్ లోనే ఉరి వేసుకోవడంతో అతని భార్య హడలిపోయింది. పోలీసులు వెళ్లి బ్యాంక్ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోవడంతో అతను చనిపోయాడు. అక్రమ సంబంధం కారణంగా బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

బ్యాంకులో ఉద్యోగం
గుజరాత్ రు చెందిన ప్రసూన్ బెనర్జీ (47) అనే వ్యక్తికి చాలా సంవత్సరాల క్రితం అపర్ణా అలియాస్ అపర్ణా బెనర్జీతో వివాహం జరిగింది. వివాహం చేసుకున్న ప్రసూన్ బెనర్జీ, అపర్ణా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. ప్రసూన్ బెనర్జీ, అపర్ణా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రసూన్ బెనర్జీ గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని ఐడీబీఐ బ్యాంకులోనే మేనేజర్ గా ఉద్యోగం చేసేవాడు. అ సందర్బంలో భార్య అపర్ణా, ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రసూన్ బెనర్జీ చాలా సంతోషంగా ఉండేవాడు.

కోల్ కత్తాకు బదిలి అయిన బెనర్జీ
కొన్ని సంవత్సరాల క్రితం ప్రసూన్ బెనర్జీకి కోల్ కత్తా సిటీలోని ఓ బ్రాంచ్ కు బదిలి అయ్యాడు, కోల్ కత్తా వెళ్లిన ప్రసూన్ బెనర్జీ అక్కడే ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. బెనర్జీ భార్య అపర్ణా, ఆమె ఇద్దరు కుమార్తెలు అహమ్మదాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. కూతుర్ల చదువు కోసం తాను అహమ్మబాద్ లో ఉంటానని, తాను కోల్ కత్తా రాలేనని ప్రసూన్ బెనర్జీకి అతని భార్య అపర్ణా చెప్పిందని తెలిసింది. తరువాత దంపతుల మధ్య మనస్పర్థలు మొదలైనాయి.

భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉరి వేసుకున్న భర్త
కోల్ కత్తాలోని పుర్బాచల్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటూ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న ప్రసూన్ బెనర్జీ రాత్రి అతని భార్య అపర్ణాకు వీడియో కాల్ చేశాడు. భార్య అపర్ణాతో వీడియో కాల్ లో మాట్లాడుతున్న ప్రసూన్ బెనర్జీ ఓ గదిలోకి వెళ్లి సీలింగ్ కు ఉన్న హుక్ తో నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నాడు. భార్య అపర్ణాతో వీడియో కాల్ లో మాట్లాడుతున్న సమయంలో బెనర్జీ ఉరి వేసుకోవడంతో అతని భార్య హడలిపోయింది.

భార్యకు అక్రమ సంబంధం ?
హడలిపోయిన అపర్ణా కోల్ కత్తా సిటీ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. కోల్ కత్తాలోని గుర్ఫా పోలీసులు వెళ్లి తలుపులు పగలగొట్టి బెనర్జీని కోల్ కత్తాలోని ఎంఆర్ బంగూర్ ఆసుపత్రికి తరలించారు. వేకువ జామున బెనర్జీ చనిపోయాడని పోలీసులు అన్నారు. భార్య అపర్ణాకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న బెనర్జీ చాలా కాలం నుంచి ఆవేదన చెందుతున్నాడని, అదే విధంగా భర్త బెనర్జీకి అక్రమ సంబంధం ఉందని అపర్ణా కూడా గొడవలు పడుతోందని పోలీసులు అన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు బ్యాంక్ ఉద్యోగి బెనర్జీ రాసిన డెత్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నామని కోల్ కత్తా సిటీ పోలీసులు తెలిపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications