భార్య టార్చర్: ఆర్మీ జవాను ఆత్మహత్య
బెంగళూరు: భార్య వేధింపులు తట్టుకోలేక సెలవులపై వెళ్లిన ఆర్మీ జవాను విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు లోని కోటే లేఔట్ లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
చిక్కమగళూరులోని కోటే లేఔట్ లో నివాసం ఉంటున్న సీ.టీ. ప్రదీప్ (26) ఆత్మహత్య చేసుకున్నాడని మంగళవారం పోలీసు అధికారులు చెప్పారు. ప్రదీప్, విధ్యా దంపతులు. ప్రదీప్ కు మద్రాసు రెజిమెంట్ లో జవానుగా ఉద్యోగం వచ్చింది.
ప్రస్తుతం ప్రదీప్ జమ్మూ కాశ్మీర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవులు తీసుకుని ఇటీవల చిక్కమగళూరు వచ్చాడు. అప్పటి నుంచి ప్రదీప్, విధ్యాల మధ్య నిత్యం వాగ్వివాదం జరిగేది. ప్రదీప్ భార్య విధ్యా మానిసిక వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేవాడు.

అయితే భార్య వేధింపులు తట్టుకోలేని ప్రదీప్ సోమవారం రాత్రి డెత్ నోట్ వ్రాసిపెట్టి విషం సేవించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మంగళవారం ప్రదీప్ మరణించాడని పోలీసులు అన్నారు.
ప్రదీప్ వ్రాసిన డెత్ నోట్ లో తన భార్య విధ్యా మానసికంగా వేధించింది, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేశారు. నా చావుకు వారే కారణం అని వ్రాసి ఉందని పోలీసులు చెప్పారు. విధ్యా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications