Viral Video: జీవితాన్ని మార్చిన పాట.. వైరల్ అవుతున్న వీడియో..
జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు జీవితాన్నే మలుపు తిప్పుతాయి. అది మంచైనా కావొచ్చు లేదా చెడైనా కావొచ్చు. ఇలా ఓ వ్యక్తి జీవితంలో ఓ ఘటన అతని జీవితాన్ని మార్చేసింది. ఒక్క రోజులో అతన్ని స్టార్ రేంజ్ తీసుకెళ్లింది. అతను జైలు గొడల మధ్య పాడిన పాట ఇప్పుడు దేశమంతా వైరల్ అవుతోంది.

కన్హయ్యరాజ్
బీహార్‌లోని కైమూర్‌కు చెందిన కన్హయ్యరాజ్ స్థానికంగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. ఇతను పాటలు కూడా బాగా పడుతాడు. కానీ అతను మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో భబువా రోడ్ రైల్వేస్టేషన్ పోలీసులు కన్హయ్యరాజ్ ను అరెస్టు చేశారు. కన్హయ్యరాజ్ ఒక రోజు జైలులో ఉంచారు. ఆ ఒక్క రోజుతో అతని జీవితం మారిపోయింది. కన్హయ్యరాజు జైల్లో ఉండగా.. పాడిన భోజ్‌పురి పాట ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ఏ దరోగా జీ
ఈ పాటను పోలీసులు రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. దీంతో కన్హయ్య పేరు మారుమోగుతోంది. వీడియోలో కన్హయ్యరాజ్ ఏ దరోగా జీ, పివా బ నాపాటా పాటను పాడారు. ఈ వీడియో ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో తీశారు. ఈ విషయమై బక్సర్ ఎస్పీ మనీష్‌కుమార్ ఫోన్‌లో మాట్లాగా.. సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో ఎక్కడిది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో తీసిన వ్యక్తి ఎవరనేది కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఏ దరోగా జీ
కైమూర్ జిల్లా, రామ్‌గఢ్ పోలీస్‌స్టేషను పరిధిలోని దహ్రక్ గ్రామం కన్హయ్యరాజ్ స్వస్థలం. జైలులో పాట పాడిన కన్హయ్య వీడియో చూసినవారంతా అతణ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే, తాను మద్యం తాగడం వల్ల అరెస్టు కాలేదని.. తన పాటల్లో అశ్లీలత ఉందని తప్పుగా భావించి ఎవరో ఫిర్యాదు చేశారని కన్హయ్య వాదిస్తున్నాడు.












Click it and Unblock the Notifications