మీకు ఎమ్మెల్యే టిక్కెట్ వస్తే మాకు ఏమిటి ?, మీకు మాత్రం నో ఎంట్రీ, మాజీ మంత్రికి షాక్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటాపోటీగా ఎన్నిలక ప్రచారం జరుగుతోంది. మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కిందా మీదపడి ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాధించుకున్న నాయకులు ఎమ్మెల్యే అయిపోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ తిండితిప్పలు మానేసి ఓటర్ల కాళ్లు పట్టుకుంటున్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సొంత పార్టీ కార్యకర్తలు ఎండకూడా లెక్క చెయ్యకుండా ప్రజల వద్దకు వెళ్లి మా పార్టీకి ఓటు వెయ్యండి అంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి ప్రత్యక్షంగా ప్రజల మధ్య తిరుగుతుంటేనే గెలవడం చాలా కష్టం.
ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చినా పోటీ చేస్తున్న నియోజక వర్గంలో ప్రచారం చెయ్యడానికి, స్థానిక ఓటర్లను కలవడానికి వీలు లేదని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కులకర్ణికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధారవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వినయ్ కులకర్ణిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మాజీ మంత్రి వినయ్ కులకర్ణి పేరుతో ఇప్పటికే నామినేన్ దాఖలు అయ్యింది.

అయితే గతంలో బీజేపీ నాయకుడు యోగేష్ గౌడ హత్య కేసులో మాజీ మంత్రి వినయ్ కులకర్ణిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసు విచారణ సీబీఐ చేస్తోంది. ధారవాడలో అడుగుపెట్టకూడదని షరతులు విధించిన సుప్రీం కోర్టు వినయ్ కులకర్ణికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి వినయ్ కులకర్ణి ధారవాడలో అడుగు పెట్టలేదు.
తనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చిందని, ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి తాను ధారవాడ వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని వినయ్ కులకర్ణి బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్ విచారణ చేసిన ప్రత్యేక కోర్టు వినయ్ కులకర్ణి ధారవాడలోకి వెళ్లడానికి మేము అవకాశం ఇవ్వలేమని, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి తేల్చి చెప్పింది. మరోసారి ఎమ్మెల్యే అయిపోవాలని అనుకుంటున్న మాజీ మంత్రి వినయ్ కులకర్ణికి బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో చుక్కెదురైయ్యింది.












Click it and Unblock the Notifications