వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాలు కోసం విమానం హైజాక్ డ్రామా... జీవిత ఖైదు.. 5 కోట్ల జరిమాన విధించిన కోర్టు

|
Google Oneindia TeluguNews

తన ప్రియురాలు కోసం ఫ్లైట్‌ హైజాక్ డ్రామా ఆడిన ఓ వ్యాపారవేత్తకు ఏన్ఐఏ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. విమానం హైజాక్ అయిందంటూ ఫేక్ లేటర్ రాసిన వ్యక్తికి 5కోట్ల జరిమానతోపాటు జీవిత ఖైదును విధించింది. కాగా జరిమానాను ఫ్లైట్‌ ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందికి పంచాలని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.

విమానాన్ని'' పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి'' తీసుకెళ్లాలంటూ లేఖ

విమానాన్ని'' పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి'' తీసుకెళ్లాలంటూ లేఖ

అక్టోబర్,30 2017లో జెట్ ఎయిర్‌ వేస్‌కు చెందిన ముంబాయి-ఢిల్లీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ముంబాయి బిర్జు సల్లా అనే వ్యాపారవేత్త బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాడు. అయితే బిర్జు సల్లా ప్రయాణిస్తున్న విమానంలోనే బిజినెస్ క్లాస్‌లోని టాయిలెట్‌లో ఉన్న టిష్యు పేపర్స్‌పైన విమానాన్ని'' పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి'' తీసుకెళ్లాలంటూ రాసి అల్లా చాల గొప్పవాడని ఇంగ్లీష్‌తో పాటు ఉర్ధూ బాషలో రాసి పెట్టాడు. దీంతో భయాందోళనలకు గురైన విమాన సిబ్బంది విమానం హైజాక్ అయినట్టు ఆందోళన చెందారు. అనంతరం విమానాన్ని వెంటనే అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దింపారు.

ప్రత్యేక చట్టాల ప్రకారం సల్లాపై కేసు

ప్రత్యేక చట్టాల ప్రకారం సల్లాపై కేసు

అయితే దీనిపై పోలీసులు విచారణ చెపట్టారు. దీంతో దీన్ని బిర్థు సల్లా చేసినట్టుగా గుర్తించారు. కాగా ఆయనపై పాత చట్టాల ప్రకారం కాకుండా విమాన హైజాక్‌లో తీసుకు వచ్చి కోత్త చట్టాల ప్రకారం కేసును నమోదు చేశారు. కాగా ఆ చట్టాల ప్రకారం కేసు పెట్టిన మొట్ట మొదటి వ్యక్తి సల్లానే కావడం గమనార్హాం .. దీంతో సల్లా విమానంలో ప్రయాణించడంపై కూడ నిషేధం విధించారు. ఇక అనంతరం కేసును విచారించిన ఏన్ఐఏ కోద్ది రోజుల క్రితం ప్రత్యేక కోర్టుకు చార్జీ షీట్‌ను ధాఖలు చేసింది.

విమాన హైజాక్ డ్రామాకు జీవీత ఖైదు

విమాన హైజాక్ డ్రామాకు జీవీత ఖైదు

దీంతో కేసును విచారించిన అహ్మదాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక సల్లాకు జీవితఖైదును విధించింది. జీవిత ఖైదుతోపాటు 5 కోట్ల రుపాయల జరిమానను కూడ విధించింది. అయితే విధించిన జరిమాన డబ్బులను ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులతోపాటు ,విమాన సిబ్బందికి ఇవ్వాలని తీర్పులో పేర్కోంది.

 ప్రియురాలు కోసమే చేశానని వెల్లడి

ప్రియురాలు కోసమే చేశానని వెల్లడి

అయితే పోలీసుల విచారణలో సల్లా చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. ముంబాయికి చెందిన ప్రియురాలు జెట్ ఎయిర్ వేస్‌లోనే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది.అయితే ఆమేను ముంబాయికి రప్పించడంతో ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థను క్లోజ్ చేస్తుందనే ఆలోచనతో తాను ఇలా చేసినట్టు ఓప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

English summary
A special NIA court in Ahmedabad on Tuesday awarded life imprisonment to a Mumbai-based businessman and imposed a fine of Rs 5 crore on him for leaving a hijack threat note on a Jet Airways plane in October 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X