Dog Bite: హడలెత్తించిన వీధి కుక్క.. రెండు గంటల్లో 40 మందిపై దాడి..
ఈ మధ్య కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఓ వీధికుక్క వీరంగం సృష్టించింది. ఈ కుక్క రెండు గంటల్లో నలభై మందిని కరిచింది. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి.కుక్కకాటుకు గురైన వ్యక్తులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కుక్కకాటుకు గురైన వ్యక్తులతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నిండిపోయింది. అయితే వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన బార్మర్ జిల్లాలోని కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
40 మంది క్షతగాత్రులను ఒకేసారి ఆస్పత్రికి రావడంతో యాజమాన్యం కూడా అవాక్కైంది. ఈ ఘటనపై స్పందించిన నగర పాలక సంస్థ కుక్కను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బంది సహాయంతో వీధికుక్కను పట్టుకున్నారు.

ఇప్పుడు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను పట్టుకునేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. అకస్మాత్తుగా వీధికుక్క కాటుకు గురై చాలా మంది గాయపడిన రోగులు ఆసుపత్రిలో చేరారని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిఎల్ మన్సూరియా తెలిపారు.












Click it and Unblock the Notifications