వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత: దేవాలయం, మసీదు చుట్టూ ప్రతి రోజూ పంది ప్రదక్షణలు, వైరల్ వీడియో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కులం, మతం అంటూ ప్రజలు గొడవలు పడుతూనే ఉన్నారు. ఇక ఆలయాలు, మసీదులు, మందిరాలు అంటూ రాజకీయాలు చేస్తున్నారు. అయితే మూగ ప్రాణి అయిన ఒక బురద పంది మాత్రం ప్రతి రోజు క్రమం తప్పకుండా దేవాలయం, మసీదు చుట్టూ ప్రదక్షణలు చేస్తూ దైవభక్తి ప్రదర్శించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పంది మసీదు, దేవాలయం చుట్టూ తిరుగుతున్న సమయంలో స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కోప్పళ పట్టణంలో ఉర దేవీ ఆలయం, మసీదు ఉన్నాయి. ఇక్కడ ఓ పంది ప్రతిరోజూ ఆలయం, మసీదు చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఆందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మొదట పందికి అవగాహనలేకపోవడం వలనే ఆలయం, మసీదు చుట్టూ ప్రదక్షణలు చేస్తోందని స్థానికులు భావించారు. అయితే క్రమం తప్పకుండా పంది ప్రతి రోజు ఆలయం, మసీదు చుట్టూ ప్రదక్షణలు చెయ్యడంతో స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

2016 డిసెంబర్ లో కర్ణాటకలోని కల్లూరు నుంచి శబరిమలకు అయ్యప్ప భక్తులు పాదయాత్ర చేశారు. ఆ సందర్బంలో కల్లూరులోని వీది కుక్క అయ్యప్ప భక్తులతో పాటు 700 కిలోమీటర్లు శబరిమల చేరుకుని తరువాత అదే భక్తులతో కలిసి కల్లూరు చేరుకునింది.

A stray pig offers Pradakshina in a temple and a mosque in Karnataka

ఆ విషయం అప్పట్లో హాట్ టాఫిక్ గా మారింది. ఇప్పుడు ఆలయం, మసీదు చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న పంది వార్తల్లో నిలిచింది.

English summary
A stray pig offers Pradakshina(circumnavigate) in a temple and also in a mosque in Koppal district of Karnataka. Viral Video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X