Lady: భార్య కోసం కెనడా వదిలి వచ్చిన టెక్కీ, 19వ అంతస్తు నుంచి దూకేసిన భార్య, ఏం జరిగింది ?
బెంగళూరు: కెనడాలో ఉద్యోగం చేస్తున్న టెక్కీ అతని భార్య కోసం బెంగళూరు వచ్చాడు. కుమార్తెకు పాలివ్వడంలో ఇబ్బందిగా ఉందని టెక్కీ భార్య ఆవేదన చెందింది. కన్నబిడ్డకు పాలు ఇవ్వలేని ఈజీవితం తనకు వద్దని అంతకు ముందు ఆమె భర్తకు చాలాసార్లు చెప్పిందని తెలిసింది. భర్త అతని భార్యకు ఎంత చెప్పినా ఆమె చివరికి 19వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం అందరూ చలించిపోయారు. ఇంట్లోనే ఉన్న టెక్కీ అతని భార్య ఆత్మహత్య చేసుకున్న వియం తెలుసుకుని హడలిపోయాడు.
బెంగళూరు సిటీలోని తలఘట్టాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. తలఘట్టపురలోని హాలిడే విలేజ్ రీసెర్చ్ రోడ్డులోని ఈస్ట్ హైలాండ్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న చరిష్మా సింగ్ (40) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. చరిష్మా జుట్టు దువ్వుకోవాలని చెప్పి ఆమె ఫ్లాట్ నుంచి బయటకు వచ్చింది. తరువాత అపార్ట్ మెంట్ 19వ అంతస్తు మీదకు వెళ్లి కారిడార్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

చరిష్మా సింగ్ ఆమె భర్త కరణ్ సింగ్ తో కలిసి తలఘట్టపరలోని ఈస్ట్ హైలాండ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. బిడ్డకు పాలు పట్టడం లేదని చరిష్మా సింగ్ నెల రోజుల నుంచి ఆమె భర్త, బంధువుల దగ్గర వాపోయింది. దీంతో మనస్థాపానికి గురైన చరిష్మా సింగ్ యలహంక సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. అయినప్పటికీ చరిష్మా సింగ్ ఆరోగ్యం మెరుగుపడక బాధపడుతూనే ఉంది.
ఈ వేదనతో చరిష్మా సింగ్ ఆదివారం మద్యాహ్నం స్నానం చేసి ఆమె ఫ్లాట్ నుంచి బయటకు వచ్చింది. తరువాత అదే అపార్ట్ మెంట్ లోని 19వ అంతస్తులోకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసిది. చరిష్మా సింగ్ సోదరుడు గౌతమ్‌సింగ్ ఫిర్యాదు మేరకు తలఘట్టపర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. చరిష్మా సింగ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఎలాంటి డెత్ నోట్ రాయలేదని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications