వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ వ్యాలీలో మూడేళ్ల బాలికపై ఆత్యాచారం.. నిందితుడిని ఉరి తీయాలని ఆందోళన

|
Google Oneindia TeluguNews

అభం శుభం తెలియని మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇది నమ్మశక్యంగా లేకున్నా బాలిక రేప్ పై కశ్మీర్ వ్యాలీలో గత వారం రోజులుగా ఆందోళనలకు కొనసాగుతున్నాయి. జాతీయ రహాదారిపై నిరసనలు తెలుపుతున్నారు. నిందుతుడికి మరణశిక్షను విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశపై కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సైతం స్పందించారు..అయితే ఈ సంఘటన గత వారం రోజుల క్రితం కశ్మీర్ వ్యాలీలోని బందిపోర జిల్లా సంబల్ ఏరియాలో జరిగింది.

మూడేళ్ల బాలిక దారుణ అత్యాచారం ...

మూడేళ్ల బాలిక దారుణ అత్యాచారం ...

కశ్మీర్‌‌‌లో మరో దారుణం జరిగింది. కొద్ది రోజుల క్రితం బందిపోర జిల్లాలోని సంబల్ ఏరియాలో తన తండ్రిచేత అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోని కోద్ది రోజులకే అదే ప్రాంతంలో మరో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యచారానికి పాల్పడ్డాడు.. చిన్నారీ పాపకు చాక్లెట్ ఇస్తానని ఆకర్షించి గ్రామాంలో ఉన్న ఓ స్కూలుకు సమీపంలోకి ఎత్తుకెళ్లాడు. స్కూల్ పక్కన ఉన్న ఓ టాయిలెట్‌ ఆత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు.

రేప్‌కు పాల్పడ్డ 18 ఏళ్లు నిండని మైనర్ బాలుడు

రేప్‌కు పాల్పడ్డ 18 ఏళ్లు నిండని మైనర్ బాలుడు

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ తాహిర్ అహ్మద్ అనే యువకుడు మధ్యలో స్కూల్ మానేసీ కార్ మెకానిక్ వర్క్ చేస్తున్నాడు.కాగా తాహిర్ కు 18 సంవత్సరాలు కూడ నిండలేదని పోలీసులు చెబుతున్నారు. నిందుతునిపై కేసు నమోదు కావడంతో తాహిర్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. కాగా బాధితురాలిని వైద్య పరీక్షల కోసం శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

 స్పందించిన కశ్మీర్ గవర్నర్ సత్నపాల్ మాలిక్

స్పందించిన కశ్మీర్ గవర్నర్ సత్నపాల్ మాలిక్

కాగా జిల్లో వారంరోజుల వ్యవధిలోనే రెండు సంఘటనలు జరగడంతోపాటు మూడు సంవత్సరాల అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడడంతో పెద్ద ఎత్తున అక్కడి మహిలలు, మహిళా సంఘాలు జాతీయా రహాదారిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ దీనిపై ద‌ృష్టి పెట్టారు. దీనిపై నిజానిజాలను వెలికితాయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. అయితే బాలికను రేప్ చేసినట్టు సాక్ష్యాలు ఉన్నాయా లేవా అనేది వైద్యపరీక్షల అనంతరం తేలనుండడంతో అప్పటి వరకు వేచి చూడనున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు.

English summary
a three-year-old girl has been allegedly raped Bandipora district of north Kashmir, triggering widespread protests across the Valley. While the Jammu and Kashmir Police promptly arrested the accused much before any protests had actually even erupted, the protesters are demanding capital punishment in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X