అసెంబ్లీలో వెలుగు చూసిన భారీ సొరంగం: రెడ్ ఫోర్ట్‌కు కనెక్ట్..
న్యూఢిల్లీ: దేశ రాజధాని.. చారిత్రాత్మక ఘట్టాలకు సాక్ష్యం. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు ఢిల్లీ కేంద్రంగా వెలిశాయి.. అదే స్థాయిలో పతనం అయ్యాయి. ఢిల్లీ అనగానే రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్, జామా మసీదు, తుగ్లకాబాద్ ఫోర్ట్, జంతర్ మంతర్ వంటి చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. వాటికి సాక్ష్యంగా ఓ సొరంగం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో సభ్యులు సమావేశమయ్యే ప్రదేశంలో కనిపించింది ఓ టన్నెల్. అసెంబ్లీ నుంచి చారిత్రాత్మక కట్టడం రెడ్ ఫోర్ట్‌కు దారి తీసేలా దీన్ని నిర్మించినట్లు నిర్ధారించారు.
Recommended Video
పంజాబీ బాగ్-పూర్వీ షాలిమార్ బాగ్ ప్రాంతంలో గల ఓల్డ్ సెక్రెటేరియట్‌లో ఉంటుంది ఢిల్లీ అసెంబ్లీ భవన సముదాయం. అక్కడి నుంచి రెడ్ ఫోర్ట్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇన్ని కిలోమీటర్ల దూరం పాటు ఈ సొరంగాన్ని తవ్వినట్టు తేలింది. ఈ సొరంగానికి చారిత్రాత్మక ఆనవాళ్లు ఏమీ లేవని అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తెలిపారు. ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించలేదని భావిస్తున్నట్లు చెప్పారు. సొరంగం తవ్వడానికి వినియోగించిన పరికరాలు ప్రాచీన కాలానికి సంబంధించినవి కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.

బ్రిటీషర్ల పరిపాలనలో ఈ టెన్నెల్ నిర్మితమై ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమర యోధుల దాడుల నుంచి తప్పించుకోవడానికి బ్రిటీషర్లు దీన్ని నిర్మించి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. 1993లో తొలిసారిగా తాను శాసనసభకు ఎన్నికైన తరువాత.. ఈ టెన్నెల్ గురించి కొంత ఆరా తీశానని రామ్ నివాస్ గోయెల్ చెప్పారు. పంజాబీ బాగ్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు ఓ టన్నెల్ ఉన్నట్లు తాను పుస్తకాల్లో చదివానని, అది అసెంబ్లీలోనే బయటపడుతుందని ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

తాను వెదికిన చారిత్రక పుస్తకాల్లో ఎక్కడ కూడా ఈ టన్నెల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలోనే ఇది వెలుగులోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ సొరంగాన్ని మరింత తవ్వే ఆలోచన ఏదీ లేదని స్పీకర్ చెప్పారు. దీనివల్ల మెట్రో రైలు ప్రాజెక్టులు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు విఘాతం కలిగే అవకాశం ఉందని అన్నారు. బ్రిటీషర్ల హయాంలో ఇప్పుడు అసెంబ్లీ ఉన్న ప్రాంతంలో కారాగారం ఉండేదని, స్వాతంత్ర్య సమరయోధులను జైలుకు తరలించడానికి ఈ టన్నెల్‌ను వినియోగించి ఉండొచ్చని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

పంజాబీ బాగ్ ప్రాంతంలో ఇప్పటికీ కారాగారాలు ఉన్నాయని, దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని- తాను ఆ కారాగారాలను సందర్శించానని చెప్పారు. దేశ రాజధానిగా ఎన్నో స్వాతంత్య్ర పోరాటాలు, మహోద్యమాలు సాగాయని స్పీకర్ గోయెల్ గుర్తు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సొరంగాన్ని విస్తరించాలనే ప్రతిపాదనలేవీ లేవని, అలాంటి వాటిని ఆమోదించకపోవడమే ఉత్తమమని గోయెల్ అన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications