Tomato: టమాటాలకు రక్షణగా బౌన్సర్లు.. ఎక్కడంటే..!
సాధారణంగా బౌన్సర్లు ఎవరికి ఉంటారు.. సినీప్రముఖులు, సెలబ్రెటీలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు బౌన్సర్లు ఉంటారు. కానీ.. ఓ చోట టమాటాలకు రక్షణగా బౌన్సర్లను పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కూరగాయల వ్యాపారి కూరగాయలు కొనడానికి వచ్చే కస్టమర్లు నుంచి టమాటాల రక్షణ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నాడు. టమాటాలు భారీగా ధర ఉండడంతో ఒక్క టమాటా పోయినా.. నష్టం వస్తుందని భావించిన వ్యాపారి బౌన్సర్ ను నియమించుకున్నాడు.
भाजपा टमाटर को ‘Z PLUS’ सुरक्षा दे. pic.twitter.com/k1oGc3T5LN
— Akhilesh Yadav (@yadavakhilesh) July 9, 2023
ఇప్పటకే చాలా మంది వినియోగదారులు తన వద్ద నుంచి టమాటాలను తీసుకెళ్లడానికి ప్రయత్నించారని చెప్పాడు. అందుకే బౌన్సర్ ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం టమాటా ధరలు భారీగా ఉన్నాయి. తెలంగాణలో కిలో టమాటా రూ.100 నుంచి 120 పలుకుతోంది. రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో కిలో టమాటా రూ.250 పలికింది. బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 గా ఉంది.

టమాటా ధరలు భారీగా ఉండడంతో కర్ణాటకలో టమాటాలు ఎత్తుకెళ్లారు. పొలంలో ఉన్న రూ.2 లక్షల విలువైన టమాటాలను రాత్రికిరాత్రికే ఎత్తుకెళ్లారు. దీంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ లో ఓ మొబైల్ షాప్ వ్యాపారి స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలను ఫ్రీగా ఇస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ కొంటే 2 కిలోల టమాటాలు ఇస్తుండడంతో రెస్పాన్స్ బాగానే వస్తుందని దుకాణదారుడు అగర్వాల్ చెప్పాడు. వినియోగదారులు కూడా సంతోషం వ్యక్తం చేసుతన్నారని చెప్పారు.
టమాట ధరలే కాదు పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా పచ్చమిర్చి, అల్లం ధరలు భారీగా పెరిగాయి. పచ్చి మిర్చి కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది.












Click it and Unblock the Notifications