Viral Video: బైక్‍ను 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వైరల్ అయిన వీడియో..
గురుగ్రామ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు బైక్ ను మూడు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లింది.
రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంచాయి. ఎక్కువగా అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతాయి. ఓ వ్యక్తి కారుతో వేగంగా వచ్చి యాక్సిడెంట్ చేశాడు. ప్రమాదం తర్వాత అతను మూడు కిలోమీటర్ల వరకు బైక్ ను ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బైక్ ను ఢీ
బుధవారం గురుగ్రామ్ లో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని బైక్ ఓనర్ బౌన్సర్ మోను తెలిపారు. కారు మొదట రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ ను ఢీకొట్టిందని, ద్విచక్ర వాహనం దాని కింద ఇరుక్కుపోవడంతో బైక్ ను ఈడ్చుకెళ్లాడని చెప్పారు. ఇతర ప్రయాణికులు కారును ఆపడానికి ప్రయత్నం చేసినా వెళ్లిపోయాడని పేర్కొన్నాడు.

సెక్టార్ 65
ఈ ఘటనలో తన మోటార్‌సైకిల్ బాగా దెబ్బతిన్నదని చెప్పాడు. సెక్టార్ 65లో హోండా సిటీ కారు బైక్ ను ఈడ్చుకెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్ ఓనర్ పోలీసులు సంప్రదించి కేసు నమోదు చేశారు. డ్రవర్
ద్విచక్రవాహనాన్ని మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి కారు పక్కకు వదిలి పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ర్యాష్ డ్రైవింగ్
అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), 427 (నష్టం కలిగించడం) కింద కేసు నమోదు చేశారు. "మేము నిందితుడిని ఫరీదాబాద్ నివాసి సుశాంత్ మెహతాగా గుర్తించాం. అతని కారును స్వాధీనం చేసుకున్నాం. నిందితుడు సెక్టార్ 63లో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు" అని గురుగ్రామ్ పోలీసు అధికారి సుభాష్ బోకెన్ తెలిపారు.
-
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications