Viral Video: మహిళ పైకి వచ్చిన నాగుపాము.. వీడియో వైరల్..
పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. ముఖ్యంగా నాగుపాము అంటే మరింత భయం ఉంటుంది. ఎందుకంటే అది విషపూరితమైనది. అందుకే చాలా మంది పాము ఉంటే ఆ పక్కకు వెళ్లం. ఒకవేళ పాము కాటేస్తే ఎలా ఉంటుంది ఊహించడానికే భయం ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.
సుశాంత్ నందా
ఓ మహిళ చెట్టు కింద పడుకుని ఉంది. అదే సమయంలో ఆమెపై పాము ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ను ఐఎఫ్ఎస్ అధికారి అయిన సుశాంత్ నందా షేర్ చేశారు. వీడియోలో, ఒక మహిళ చెట్టు కింద మంచం పడుకుని ఉంది.ఆ పై నాగుపాము పడగ విప్పి ఉంది. గుడిసె పక్కనే ఒక చిన్న ఆవు కోడలు కట్టి ఉంది. అయితే ఆ మహిళపై పాము కనిపించింది.
When this happens, what would be your reaction??
— Susanta Nanda IFS (@susantananda3) August 28, 2022
For information, the snake moved away after few minutes without out causing any harm…
(As received from a colleague) pic.twitter.com/N9OHY3AFqA

42 వేలకు పైగా వ్యూస్
మహిళకు ఎలాంటి హాని తలపెట్టకుండా పాము వెళ్లిపోయిందని నందా చెప్పాడు. ఈ వార్త రాసే సమయానికి వీడియోకు 42 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1237 లైక్స్ వచ్చాయి. 225 రీట్వీట్లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. నాకు పాము చాలా భయం అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఆ మహిళ చాలా అదృష్టవంతురాలని కామెంట్ చేశారు.













Click it and Unblock the Notifications