వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video: కదులుతున్న రైల్లో మొబైల్ చోరీకి యత్నం.. సీన్ కట్ చేస్తే 10 కి.మీ చుక్కలు చూశాడు..

|
Google Oneindia TeluguNews

సాధారణంగా దొంగలు ఏం చేస్తారంటే అప్పుడే కదులుతున్న రైళ్లలో కిటికీ వద్ద ఉన్నవారిని టార్గెట్ చేస్తారు. ప్రయాణికులు కిటికీ వద్ద మొబైల్ ఫోన్ వాడటాన్ని గమనిస్తారు. రైలు కదులుతుండగా ఫోన్ లాక్కోని పరుగెత్తుతుంటారు. ఇలా ఓ దొంగ అప్పుడే స్టార్ట్ అయిన రైల్లో కిటికీ వద్ద మొబైల్ వాడుతున్న ప్రయాణికుడిని చూశాడు.

మెరుపు వేగంతో

మెరుపు వేగంతో

మెరుపు వేగంతో వచ్చి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయాణికుడు తెలివిగా వ్యవహరించి దొంగను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో దొంగ కిటికీకి వేలాడుతూ 10 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 14న బిహార్ లోని బెగుసరాయ్‌ నుంచి ఖగారియాకు వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు రైలు ఎక్కాడు.

నన్ను క్షమించు

నన్ను క్షమించు

రైలు అప్పడే కదలడం మొదలైంది. ఆ ప్రయాణికుడు కిటికీ వద్ద మొబైలు ఫోను పట్టుకుని ఉన్నాడు. ఇది గమనించిన దొంగ మొబైల్‌ను కొట్టేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ప్రయాణికుడు దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు వేగం పెరుగుతోంది. ఆ దొంగ అన్న నన్ను క్షమించు అంటూ వేడుకున్నాడు.

10 కిలోమీటర్లు

10 కిలోమీటర్లు

కానీ ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో అతడు తీవ్రమైన భయాందోళనుకు గురయ్యాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు స్నాచర్‌ చేయి వదలడంతో అతడు పారిపోయాడు.

జీఆర్పీ

ఇందుకు సంబంధించిన వీడియోను కుమార్ సౌరభ్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పోస్టుతో పాటు "కదులుతున్న రైలులో మొబైల్ స్నాచర్ దొంగతనం ప్రయత్నం విఫలమైంది. బహుశా అతని జీవితంలో ఈ రోజు అత్యంత దారుణమైంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు కదులుతున్న రైలులో కిటికీకి దొంగ వేలాడు. దీంతో ప్రయాణికులు అతడిని జీఆర్పీకి అప్పగించారు." అని రాశారు.

English summary
A man tried to steal a mobile from a moving train but failed. He went 10 kilometers hanging on the train. This video is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X