Viral Video: బాలికపై చేయి చేసుకున్న పోలీస్.. వీడియో వైరల్..

పోలీసులంటే అందరికి రక్షణగా ఉండాలి. అందరిని గౌరవించాలి. కానీ కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొస్తోంది. తాజాగా ఓ పోలీసులు బాలిక కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఈ వీడియోను రోమితా తివారీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

పోలీసులు రక్షణ కల్పిస్తారా

పోలీసులు రక్షణ కల్పిస్తారా

ఈ వీడియోలో పోలీసులు ఓ చోటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న బాలికపై ఓ పోలీస్ అధికారి చేయి చేసుకున్నారు. అతను బాలిక చెంపపై బలంగా కొట్టాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తివారీ ఈ పోస్ట్ తో పాటు ఢిల్లీలోని జహంగీర్‌పురి ఎస్‌హెచ్‌ఓ బాలికను చెంపదెబ్బ కొట్టాడు. ఇలాంటి మహిళలకు పోలీసులు రక్షణ కల్పిస్తారా? అని పోస్ట్ పెట్టాడు.

4 లక్షలకుపైగా వ్యూస్

4 లక్షలకుపైగా వ్యూస్

ఈ వీడియోను ఇప్పటి వరకు 4 లక్షలకుపైగా మంది చూశారు. ఈ వీడియో చూసిన వారు ఆ పోలీస్ ఆఫీసర్ పై విరుచుకుపడుతున్నారు. ఇదేం పోలీసింగ్ అని ప్రశ్నిస్తున్నారు. కాగా ఢిల్లీలో జనవరి 1 న జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందడం ఢిల్లీలో సంచలనం సృష్టించింది.

20 కిలోమీటర్లు

20 కిలోమీటర్లు

గత ఆదివారం తెల్లవారుజామును తాప్పతాగిన కొంత మంది కారుతో ఓ యువతిని ఢీకొట్టారు. ఢీకొట్టడమే కాదు దాదాపు 20 కిలోమీటర్ల వరకు మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. అక్కడున్న ప్రత్యక్ష సాక్షి గస్తీ పోలీసులను ఎన్నిసార్లు సంప్రదించిన సరిగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి.

స్టుమార్టంలో విస్తూపోయే నిజాలు

స్టుమార్టంలో విస్తూపోయే నిజాలు

ఈ ఘటనలో యువతి పోస్టుమార్టంలో విస్తూపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె ఒంటిపై 40కి పైగా గాయాలను వైద్యులు గుర్తించారు. పక్కటెముకలు బయటకు వెనుకవైపు పొడుచుకువచ్చాయి. రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో శరీరం మొత్తం కమిలిపోయింది. తల పగిలి మెదడు బయటకు వచ్చి.. అందులో కొంత భాగం మిస్సయ్యింది. వెన్నుముక పూర్తిగా విరిగిపోయిందని రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు.

ఉరి శిక్ష వేయాలి

ఈ కేసులో నిందితులను శిక్షించాలంటూ యువత పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించాలని కోరింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అరోరాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+