Viral Video: వామ్మో.. ఎందీలొల్లి.. రైలులో సీటు కోసం రక్తమొచ్చేలా కొట్టుకున్న మహిళలు..
లోకల్ రైలులో సీటు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఇద్దరు మహిళలు ముంబయి లోకల్ ట్రైన్ లో సీటు కోసం రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై కూడా దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 27 ఏళ్ల మహిళ నిందితురాలని అరెస్ట్ చేశారు. వాషి రైల్వే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శంభాజీ కటారే తెలిపిన వివరాల ప్రకారం
తుర్బే స్టేషన్
గత బుధవారం రాత్రి 7.45 గంటలకు నవీ ముంబైలోని థానే-పన్వేల్ మధ్య నడిచే లోకల్ ట్రైన్ తుర్బే స్టేషన్ రాగానే ఓ సీటు ఖాళీ అయింది. అప్పటి వరకు నిల్చున్న ఇద్దరు మహిళలు ఆ సీటులో కూర్చునేందుకు ప్రయత్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. వారిద్దరికి మరికొందరు మహిళలు తోడవడంతో మహిళా కంపార్ట్ మెంట్ రణరంగమైంది.

అర్జూ ఖాన్
కోపంతో ఊగిపోయిన జుట్టు పట్టుకుని రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ శారద ఉగాలే సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఆమెపై కూడా దాడి చేశారు. దీంతో మహిళా కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మహిళల గొడవకు సంబంధించి కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు అర్జూ ఖాన్ అనే మహిళను అరెస్ట్ చేసి శుక్రవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు.
She has been arrested & will be produced in court by Railway Police. https://t.co/8rG2QRzEoT
— Sweety (@AdimulamSweety) October 6, 2022












Click it and Unblock the Notifications