వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: పకోడాలు అమ్మిన మమతా బెనర్జీ.. వైరల్‍గా మారిన వీడియో..

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీధి వ్యాపారిగా ఆవతామెత్తారు. ఝర్‌గ్రామ్‌లో రోడ్డు పక్కన టీ స్టాల్‌లో టీ అమ్మారు.బెల్పహారి నుండి ఝర్‌గ్రామ్‌కు తిరిగి వెళ్తున్న దీదీ.. అంధారియా గ్రామ సమీపంలో తన కాన్వాయ్‌ను ఆపి టీ స్టాల్ వద్దకు వెళ్లారు. అక్కడున్న వారికి పకోడాలు (వడలు) వడ్డించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యమంత్రి రావడంతో అక్కడ స్థానికులు గుమిగూడారు.

మమతా వార్త పత్రికలో పకోడాలు చుట్టి స్థానికులకు ఇచ్చారు. మమతా బెనర్జీ ఝర్‌గ్రామ్‌లో గిరిజన ఔట్రీచ్ ప్రోగ్రామ్ కోసం వెళ్తున్నారు. మమతాబెనర్జీ చిరుతిళ్లను అమ్మడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో డార్జిలింగ్‌లోని ఒక చిన్న స్టాల్‌లో మమత మోమోలను తయారు చేస్తూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆమె గతంలో స్వయం సహాయక బృందం (SHG)కి చెందిన మహిళలు నిర్వహించే స్టాల్‌ను సందర్శించినప్పుడు ఆమె ఒకసారి ఫుచ్కా తయారీలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

A video of West Bengal Chief Minister Mamata Benarji selling pakodas has gone viral on social media

మమతా బెనర్జీ కేంద్రంతో పోరాటం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు రావాల్సిన బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించడం లేదని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి జీఎస్టీ చెల్లింపులను నిలిపి వేస్తామని హెచ్చరించారు.
English summary
A video of West Bengal Chief Minister selling pakodas has gone viral on social media. She wrapped the pakodas in paper and gave them to the locals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X