UGC NET Admit Cards:మరో వారం రోజుల్లో పరీక్ష...నో హాల్ టికెట్స్.. అభ్యర్థుల్లో టెన్షన్..!
మరో వారం రోజుల్లో యూజీసీ నెట్... నెట్‌కు అప్లయ్ చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన. ఇదెందుకు అనుకుంటున్నారా..? ఇప్పటి వరకు పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదు. దీంతో అభ్యర్థుల్లో ఒక్కింత టెన్షన్ నెలకొంది.
సెప్టెంబర్ 16వ తేదీన దేశవ్యాప్తంగా నెట్ పరీక్ష జరగనుంది. అయితే ఇప్పటి వరకు అధికారులు హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో పొందుపర్చకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన జారీ కాలేదు. పరీక్ష నిర్వహించే ఏజెన్సీ ప్రకారం రోల్‌నెంబర్, పరీక్షా సెంటర్, తేదీ, పరీక్షా సమయం సూచించే అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి పరీక్ష ప్రారంభానికి 15 రోజుల ముందు అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అడ్మిట్ కార్డులు పొందుపర్చకపోవడంతో అభ్యర్థుల్లో అసలు పరీక్ష జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనే కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి.

సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ఆ తర్వాత సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు నెట్ పరీక్ష జరగాల్సి ఉంది. పేపర్ 1 మరియు పేపర్ -2లు ఉంటాయి. పేపర్ -1కు 100 మార్కులు ఉండగా పేపర్ -2కు 200 మార్కులు ఉంటాయి. రెండు సెషన్లలో నిర్వహించే పరీక్ష తొలి పేపర్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30కు ముగియనుండగా... రెండో పేపర్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటలకు ముగుస్తుంది.
Recommended Video
అంతకుముందు జూన్ 15 నుంచి జూన్ 20 వరకు జరగాల్సిన పరీక్షలు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. అయితే ఈ సారి కోవిడ్-19 నిబంధనలకు లోబడే పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం కొన్ని గైడ్‌లైన్స్ కూడా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. అంతేకాదు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు కూడా అర్హత సాధిస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications