దారుణం .. పిల్లల ముందే ఇంజనీర్ అయిన భర్తను కిరాతకంగా పొడిచి చంపిన భార్య
కన్న బిడ్డల ముందే ఒక భార్య భర్తను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చింది. పంజాబ్ రాష్ట్రం, గుర్గావ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది . పోలీసులు అందించిన వివరాల ప్రకారం 39 ఏళ్ల వయసున్న సచిన్ కుమార్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య గుంజన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరచూ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవని, ఈ ఘర్షణల క్రమంలోనే భార్య భర్తను హతమార్చిందని పోలీసులు అంటున్నారు.
గుర్గావ్ లోని జ్యోతి పార్క్ కాలనీ లో భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న ఈ ఘర్షణలో భార్య ఆగ్రహంతో భర్తను కిచెన్లో ఉపయోగించే కత్తితో పొడవడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. భార్యాభర్తలు ఘర్షణ పడుతూ, భార్య భర్త పై దాడి చేసిన సమయంలో వారి ఇద్దరి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సచిన్ సోదరుడు నీరజ్ ఆసుపత్రికి తీసుకు వెళ్లినా తీవ్ర రక్తస్రావం కావడంతో సచిన్ ప్రాణాలు దక్కలేదు. దీంతో నీరజ్ తన సోదరుడి మరణానికి అతని భార్య గుంజన్ కారణమని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సచిన్ సోదరీమణులు -రేష్మా , శిల్ప న్యాయం కోసం విజ్ఞప్తి చేశారు . గుంజన్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఒత్తిడి చేశారు.అరెస్టు చేసి, ఆమె చేసిన పనికి శిక్షించాలని మేము కోరుతున్నామని సచిన్ సోదరి రేష్మా అన్నారు.

సచిన్ తన భార్య నుండి కత్తిని లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆ క్రమంలో అతనికి గాయమైందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్తున్నారు. అయితే సచిన్ చాలా సౌమ్యంగా వ్యవహరించే వ్యక్తి అని, కానీ భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు జరుగుతుండేవి తెలియదని స్థానికులు అంటున్నారు. పోలీసులు హత్య జరిగిన సమయంలో ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉండడంతో ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి హత్యకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications