కూతుర్ని చంపి ఆత్మహత్య చేసుకున్న లేడీ, భర్త చేసిన పనికి, అత్తారింటికి వచ్చిన రెండు రోజుల్లో ?
వివాహం జరిగిన మూడు సంవత్సరాలకే ఓ మహిళ జీవితం ముగిసిపోయింది. రెండేళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లా చించోలి తాలూకా మారపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. శివలీల అలియాస్ లీలా (23) అనే మహిళ ఆమె కుమార్తె వర్షిత (2)ను హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని కలబురిగి పోలీసులు తెలిపారు.
శివలీల అలియాస్ లీలా చించోలి తాలూకా కెరొల్లి గ్రామానికి చెందినది. సాయంత్రం మారపల్లి గ్రామంలోని తన నివాసంలో లీలా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మారపల్లి గ్రామానికి చెందిన ఆనంద్‌తో మూడేళ్ల క్రితం లీలా వివాహమైందని సమాచారం. పెళ్లయ్యాక భర్త ఆనంద్, అత్తగారి నుంచి వేధింపుల వస్తున్నాయని లీలా అనెకసార్లు ఆమె కుటుంబ సభ్యుకు సమాచారం ఇఛ్చిందని ఆరోపణలు ఉన్నాయి.

లీలా భర్త ఆనంద్, ఆమె అత్త నుంచి వేధింపులకు గురై లీలా కొన్ని నెలల క్రితం ఆమె స్వగ్రామానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే లీలా రెండు రోజుల క్రితమే తిరిగి భర్త ఆనంద్ ఇంటికి వెళ్లింది. భర్త ఆనంద్ ఇంటికి వెళ్లిన లీలా ఒక్కరోజు మాత్రమే సంతోషంగా ఉందని, తరువాత మరుసటి రోజు సాయంత్రం ఇంట్లో ఆమె కుమార్తను హత్య చేసి తరువాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చించోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సీఈవ సుచనా సేఠక అలియాస్ సుచన ఆమె నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి జైలుకు వెళ్లింది. సుంచనాకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని పోలీసులు కోర్టుకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ హ్యూమన్ బిహేవియర్‌లో సుచనకు నిర్వహించిన మానసిక పరీక్ష నివేదికను పోలీసులు కోర్టు ముందు సమర్పించారు.

ఈ నివేదిక ప్రకారం సుచనకు ఎలాంటి మానసిక సమస్య లేదని, ఆమెకు ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం లేదని తేలిందని పోలీసులు తెలిపారు. సుచన మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని ఆమె తండ్రి కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ సీఇవో సుచన జ్యుడీషియల్ కస్టడీలో ఉంటోంది. కుమారుడిని గోవాకు పిలుచుకుని వెళ్లిన సుచన అక్కడే కొడుకును చంపేసి శవాన్ని సూట్ కేసులో పెట్టుకుని బెంగళూరుకు వస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications