Cyber Crime: పార్ట్ టైమ్ జాబ్.. రూ.54 లక్షలు పోగొట్టుకున్న మహిళ..!
కొంత మందికి భారీగా జీతం వచ్చినా సరిపోవడం లేదు. పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతుకుతున్నారు. జీతంతో పాటు పార్ట్ జీతం కావాలని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి నష్టపోతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలా చూశాం. తాజాగా కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ముంబైకి చెందిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఏకంగా రూ.54 లక్షలు కోల్పోయింది. చివరికి మోసపోయానని తెలిసుకుని పోలీసులను ఆశ్రయించింది.
నవీ ముంబైకి చెందిన ఓ మహిళలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు జీతం కూడా బాగానే వస్తోంది. ప్రస్తుతం ఆ మహిళ ప్రసూతి సెలవుల్లో ఉంది. ఆమె జీతంతో పాటు మరింత డబ్బు సంపాదించాలని పార్ట్ టైమ్ జాబ్ కోసం ఆన్ లైన్ లో వెతకడం మొదలు పెట్టింది. ఆన్ లైన్ లో కొంత మందిని సంప్రదించింది. సదరు వ్యక్తులు తమ వద్ద ఫ్రీలాన్సింగ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని ఆమెకు చెప్పారు. తాము ఇచ్చి టాస్క్ పూర్తి డబ్బులు ఇస్తామని వారు చెప్పరు.

సైబర్ నేరగాళ్లు ఆమెకు హోటల్లకు రేటింగ్ ఇచ్చేందుకు లింక్ లు పంపారు. ఆమె లింక్ లు ఓపెన్ చేసి రేటింగ్ ఇచ్చింది. దీంతో ఆమెకు కొంత డబ్బు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను పెట్టుబడి పెట్టాలని.. భారీగా ఆదాయం వస్తుందని చెప్పారు. దీంతో ఆమె మే 7 నుంచి 10 తేదీల మధ్యన దశలవారీగా రూ.54,30,00 వారికి పంపింది. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్ కు స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లింది.
చాలా మంది మహిళలు ఇలానే మోసపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. అధిక డబ్బు కోసం ఆశపడి మహిళలు సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారని వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.












Click it and Unblock the Notifications