మహిళల మధ్య ప్రేమ పుట్టించిన టిక్‌టాక్.....! భర్తను వదిలి వెళ్లిన గృహిణి
టిక్‌టాక్ సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్... ఈ యాప్ ద్వార వ్యక్తుల్లో ఉండే... టాలెంట్ బయటకు రావడం... వారిని వేలాది మంది ఫాలో కావడంతో ఈ యాప్ అత్యంత ప్రాచుర్యం పొందింది. అయితే ఈ యాప్ ద్వార అనేక మందికి ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తున్నా... అదే స్థాయిలో అనేక మంది వ్యక్తిగత జీవితాల్లోకి చోచ్చుకువచ్చింది. టీక్‌టాక్ మోజులో పడి లబ్ధిపొందాలనుకే వినియోగదారులు దాని ఊబిలో కొట్టుకుపోతున్నారు.. దాని కోసం తమ జీవితాలనే పణంగా పెడుతున్నారు. దీని బారిన యువతి యువకులే కాకుండా పెళ్లయిన పెద్దవాళ్లు కూడ ఉండడం గమనార్హం.

మహిళల టిక్‌టాక్ మోజు
ఈ నేపథ్యంలోనే తాజాగా టిక్‌టాక్ వీడియోల మోజులో ఇద్దరు యువతుల మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆ సంబంధమే పెళ్లయిన భర్తతో గోడవలకు దారి తీసింది. మరో మహిళ మోజులో పడిన ఇళ్లాలు భర్తను, పిల్లలను వదిలించుకోవాలని చూసింది. అయితే పిల్లలను కాదనుకోలేక భర్త నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేసింది. దీంతో భర్తతో గొడవపడి కొన్నాళ్లు ఆమె పట్టింటికి వచ్చింది. తిరిగి కొద్ది రోజులకే టీక్‌టాక్ ప్రియురాలిని వెతుకుంటూ... వెళ్లింది.

ఇద్దరు మహిళల మధ్య శారీరక సంబంధం
వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా అదోనికి చెందిన యువతి అర్ఛనకు కర్ణాటక కొప్పళకు చెందిన వ్యక్తితో 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరి మధ్య సంసారం సాఫిగా జరుగుతుండగా... అదోని మహిళ చెల్లెలు కూడ బెంగళూరులో ఉంటుంది. చెల్లెలి భర్త నగరంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అయితే అదే బంకులో పనిచేసే మరో మహిళ అంజలితో ఇద్దరు అక్కా చెల్లెల్లకు పరిచయం ఏర్పడింది. అయితే చెల్లెలు బాగానే ఉన్నా.. అక్క అర్చన మాత్రం పెట్రోల్ బంకులో పని చేసే అంజలి మధ్య సాన్నిహిత్య సంభంధం ఏర్పడింది. మరోవైపు అంజలి టిక్‌టాక్‌లో అప్పడప్పుడు మగాళ్లలా వేషం వేసి వీడియోలు కూడ చేస్తుంది.

పిల్లలను తీసుకుని ప్రియురాలి వద్దకు వెళ్లిన వివాహిత
ఇలా ఇద్దరు చాలా సాన్నిహిత్యం ప్రేమగా మారింది.. దీంతో అర్చన భర్తను వదిలి టీక్‌టాక్ చేసే అంజలితో జీవితాన్ని పంచుకోవాలనే అలోచనకు వచ్చింది. అనుకున్నదే తడవుగా భర్తతో పలుసార్లు ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణల్లోనే... ఇద్దరు పిల్లలను తీసుకుని ఆదోనిలోని పుట్టింటికి చేరింది. కొద్ది రోజులపాటు తల్లిదండ్రుల వద్ద ఉన్న అర్చన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈనెల పదిన పిల్లలను తీసుకుని టిక్‌టాక్ యువతి వద్దకు వెళ్లింది.

ప్రియురాలితో టిక్‌టీక్‌లు చేస్తూ...
ప్రయురాలితో కలిసి కొత్త జీవితాన్ని అరంభించేందకు సిద్దమైంది.. దీంతో అర్చన అదృశ్యంపై ఆమె తల్లితండ్రులతో పాటు భర్త అదోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బెంగళూరు వెళ్లి ఇద్దరు మహిళ జంటను పట్టుకున్నారు. అనంతరం వారిద్దరు చేసిన టిక్‌టాక్ వీడీయోలు చూసి పోలీసులు ఆశ్చర్య పోయారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉండడంతోనే ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications