సుప్రీంకోర్టు గేట్ వద్ద ఆత్మహత్యా యత్నం: తీవ్రంగా కాలిన గాయాలతో
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ఆవరణలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తితో పాటు అతని వెంట వచ్చిన ఓ మహిళ ఆత్యహత్యాయత్నం చేశారు. తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని, నిప్పింటించుకున్నారు. బలవన్మరణానికి ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు వారిని మంటల బారి నుంచి రక్షించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు విచారణలకు కొంత అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యకు ప్రయత్నించిన వారు ఎవరనేది ఇంకా తెలియరావట్లేదు. పోలీసులు వారిని విచారిస్తోన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్నందున.. కొంత కోలుకున్న తరువాత వారిని విచారిస్తామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. బలవన్మరణానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి, అతనితో పాటు వచ్చిన మహిళ మధ్య ఉన్న సంబంధం ఏమిటనేది కూడా తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిద్దరూ ఈ ఉదయం సుప్రీంకోర్టు గేట్ డీ వద్దకు చేరుకున్నారు. లోనికి రావడానికి ప్రయత్నించారు. అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. సరైన కారణం గానీ, డాక్యుమెంట్లు గానీ ఉంటేనే లోనికి పంపిస్తామని చెప్పారు. దీనితో వెనక్కి వెళ్లిన వారిద్దరూ మళ్లీ గేట్-డీ వద్దకు చేరుకున్నారు. అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆవరణ లోనికి ప్రవేశించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఈ మధ్యాహ్నం 12:20 నిమిషాలకు హఠాత్తుగా వారిద్దరూ తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటిచుకున్నారు. మంటలను తట్టుకోలేక వారు పెట్టిన అరుపులకు ఉలిక్కపడ్డ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. అక్కడే ఉనన మరి కొందరు యువకులు ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడారు. నిండుగా బ్లాంకెట్ కప్పిన వ్యక్తి కాళ్లకు కాలిన గాయాలు కనిపించాయి. అంబులెన్స్ వచ్చిన వెంటనే వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
వారు ఆత్మహత్యా యత్నం చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వారు కోలుకున్న వెంటనే స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తామని తెలిపారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications