బెంగళూరులో కలకలం, మహిళను ముక్కలుగా నరికేసి శవాన్ని డ్రమ్ లో?, ఏం జరిగిందంటే!

ఢిల్లీలో ప్రియురాలిని హత్య చేసి ఆమె మృతదేహాన్ని నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే బెంగళూరులో వెలుగు చూసింది. ఇక్కడ ఓ మహిళ మృతదేహాన్ని నరికి నీటి డ్రమ్ములో పెట్టిన ఘటన కలకలం రేపింది. బెంగళూరులోని కేఆర్ పురం ప్రాంతంలో మహిళ మృతదేహం డ్రమ్ములో లభ్యం కావడంతో స్థానికులు హడలిపోయారు.

ఛిద్రమైన మహిళ మృతదేహాన్ని డ్రమ్ములో వేసిన ఘటన వెలుగులోకి రావడంతో అత్యధిక రద్దీగా ఉండే బెంగళూరు నగరంలోని కేఆర్ పురం ప్రజలు ఉలిక్కిపడ్డారు. పాడుబడిన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో మహిళ శవాన్ని డ్రమ్ములో పెట్టి పడేసి పారిపోయారు. హత్యకు గురైన మహిళను సశీలమ్మ అలియాస్ సుశీలగా గుర్తించామని బెంగళూరులోని కేఆర్ పురం పోలీసు అధికారులు తెలిపారు.

A woman was murdered in Bengaluru and her body was cut into pieces and thrown in a drum

కేఆర్‌పురం సమీపంలోని నిసర్గ లేఅవుట్‌ సమీపంలోని ఓ ఫ్లాట్‌లో సుశీలమ్మ అనే మహిళ అద్దెకు నివసిస్తోంది. మృతురాలు సుశీలమ్మతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు, మరికొందరు బంధువులు నివసిస్తున్నారని కేసు దర్యాప్తు చేపట్టిన బెంగళూరు తూర్పు అదనపు కమిషనర్ రామన్ గుప్తా మీడియాకు తెలిపారు. సుశీలమ్మను హత్య చేసిన దుండగులు ఆమె చేతులు, కాళ్లతో పాటు శరీరంలోని అవయవాలను నరికేశారని పోలీసులు అంటున్నారు

సుశీలమ్మ శరీర భాగాలను డ్రమ్‌లో నింపిన నిందితులు స్థానికంగా ఉన్న ఖాళీ స్థలంలో దానిని పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఖాళీ స్థలం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న కేఆర్ పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఓ మహిళను ఎవరో హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ లో నింపి వెళ్లిపోయారని మొదట పొలీసులు అనుకున్నారు. తరువాత హత్యకు గురైన మహిళ పేరు సుశీలమ్మ అని వెలుగు చూసింది

ఆదివారం సుశీలమ్మను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆదారాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసు అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతోందని, వీలైనంత త్వరగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నామని పోలీసు అధికారులు తెలిపారు. సుశీలమ్మను ఎందుకు హత్య చేశారు? ఎవరు హత్య చేశారనేది పోలీసుల విచారణలో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+