Manipur: మణిపూర్‍లో దారుణం.. పాఠశాల బయట మహిళ కాల్చివేత..
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్రంలో రెండు నెలలుగా జాతుల మధ్య వైరంతో ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఓ పాఠశాల వెలుపల ఒక మహిళను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. స్కూళ్లు పునప్రారంభం అయిన మొదటి రోజే ఈ ఘటన జరిగింది. అయితే హత్యకు గురైన మహిళ ఎవరన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మాపావో, అవాంగ్ సెక్మాయ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ గ్రూపుల మధ్య కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఘర్షణను భద్రతా బలగాలు భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగిందని వార్తా సంస్థ PTI నివేదించింది.
మణిపూర్ లో ఘర్షణల వల్ల గత రెండు నెలలుగా విద్యాసంస్థలు మూసివేశారు. జులై 5న తిరిగి ప్రారంభించారు. బుధవారం థౌబల్ జిల్లాలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కు చెంది ఓ జవాన్ ఇంటికి అల్లరిమూకలు నిప్పు పెట్టాయి. ఆయుధలు ఎత్తుకెళ్ల కుండా అడ్డుకున్నందుకు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.వాంగ్బాల్ వద్ద 3వ IRB శిబిరంపై దాడి చేయకుండా అల్లరి మూకలను అడ్డుకున్న తర్వాత, ఆయుధాగారాన్ని కాపాడే యూనిట్‌లో భాగమైన IRB సిబ్బంది లక్ష్యంగా మారారు.

ఈ సంఘటనల దృష్ట్యా, మణిపూర్ ప్రభుత్వం జూలై 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల నిలిపివేతను మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మొదట మే 3న ఇంటర్నెట్ పై నిషేధం విధించారు. ఇంటర్నెట్ నిలిపివేతపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహరం హైకోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం చెప్పింది.
షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు పోటీగా 'గిరిజన సంఘీభావ యాత్ర' నిర్వహించిన తర్వాత మణిపూర్ లో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఈ ఘర్షణాల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications