ఆరు నెలలు, 7గురు గ్యాంగ్ రేప్: అబార్షన్‌కు అంగీకరించాలని బాధితురాలు
గుజరాత్: అత్యాచారానికి గురైన మహిళ తనకు అబార్షన్ చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో తనకే తెలియదని, పుట్టిన బిడ్డకు మీ నాన్న ఇతనే అని ఎవరిని చూపించాలని ఆ మహిళ విలపిస్తున్నది.
తన కడుపులో ఉన్న బిడ్డను తన కుటుంబ సభ్యులు దగ్గరకు తీసుకోరని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లింది.
బాధితురాలి ఆవేదన తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జే.బి. పర్ధివాల మీ బాధ అర్థం అయ్యిందని బాధితురాలికి చెప్పారు. మీ అభిప్రాయం, నిర్ణయం చెప్పాలని గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తీర్పును రిజర్వులో పెట్టింది.
సూరత్ సమీపంలోని గ్రామంలో 24 సంవత్సరాల మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు వివాహం అయ్యింది. భర్త ఉన్నాడు. గత సంవత్సరం ఈ మహిళను 7గురుకామాంధులు కిడ్నాప్ చేశారు. తరువాత ఒక గ్రామంలోని ఇంటిలో నిర్బంధించారు.

ఆరు నెలల పాటు ఆమెను నిర్బంధించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆరు నెలల పాటు ఆమె వరుసగా అత్యాచారానికి గురి అయ్యింది. అదే సమయంలో ఆమె గర్బవతి అయ్యింది. చివరికి కామాంధుల నుండి తప్పించుకున్న మహిళ సొంత గ్రామానికి చేరుకునింది.
తరువాత తాను గర్బవతిననే విషయం తెలుసుకుంది. ప్రస్తుతం ఆమె 7నెలల గర్బవతి. తనకు అబార్షన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సూరత్ కోర్టును ఆశ్రయించింది. అబార్షన్ చేసుకోవడానికి చట్టం అంగీకరించదని కోర్టు చెప్పింది.
చివరికి బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి తీసుకు వెళ్తేతన భర్త, కుటుంబ సభ్యులు అంగీకరించరని ఆమె అంటున్నది. 7 నెలల్లో అబార్సన్ చేస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు అంటున్నారు. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తరువాత పుట్టిన బిడ్డను అనాథ ఆశ్రమంలో వదిలి పెట్టాడానికి ఆమెను ఒప్పించడానికి గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.












Click it and Unblock the Notifications