బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

madam: భర్త ఇంజనీరు, కూతురు డాక్టర్, కొడుకు టెక్కీ, టిప్పుటాప్ గా రెఢీ అయ్యి మేడమ్ ఏం చేసిందంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంజనీర్ ను వివాహం చేసుకున్న మహిళ భర్తతో సంతోషంగా కాపురం చేసి ఓ కూతురికి, కొడుక్కి తల్లి అయ్యింది. ఇంజనీర్ దంపతులు వారి పిల్లలను బాగా చదివించారు. కూతురు డాక్టర్, కొడుకు ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇంజనీరు అయిన భర్త అతని భార్యకు ఏం కావాలన్నా లేదనకుండా తీసిస్తున్నాడు. భార్యను సినిమాలు, షికార్లకు తిప్పుతున్నాడు. ఆర్థికంగా ఆ కుటుంబంలోని ఇంజనీరు, డాక్టర్ అయిన కూతురు, కొడుకు ముగ్గురు ప్రతినెల లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నారు. ఇంజనీర్ భార్యకూడా బాగా చదువుకుంది. ఇలాంటి ఫ్యామిలీలోని మహిళ చేసిన పనికి ఆమె కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు హడలిపోయారు. టిప్పుటాప్ గా రెఢీ అవుతున్న మహిళ యాక్టీవ్ హోండా స్కూటల్ వెళ్లి ఏం చేసింది అని తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు.

Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?Wife: లవ్ మ్యారేజ్, నిద్రపోతున్న భర్త ?, కుర్రాడు బాబోయ్ గుర్రమెక్కినాడే అంటూ, 10 ఏళ్లు చిన్నోడిడో ?

మంచి ఫ్యామిలీ

మంచి ఫ్యామిలీ

బెంగళూరులోని కొడిగేహళ్లిలో లీలావతి (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. లీలావతి భర్త ఇంజనీరు. లీలావతి కుమార్తె డాక్టర్ గా ఉద్యోగం చేసోంది. లీలావతి కుమారుడు ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటిలో భర్త, కూతురు, కొడుకు ప్రతినెల లక్షల్లో సంపాధిస్తుంటే లీలావతి ఇంటి దగ్గరే ఉంటున్నది. లీలావతి కూడా విద్యావంతురాలే.

 షేక్ సలామ్ బజ్జీ సెంటర్

షేక్ సలామ్ బజ్జీ సెంటర్


బెంగళూరులోని బ్యాటరాయణపూర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలోని షేక్ సలాం అనే వ్యక్తి నిర్వహిస్తున్న బజ్జీ దుకాణానికి వెళ్లిన లీలావతి తనకు బజ్జీలు పార్శిల్ ఇవ్వాలని చెప్పింది. ప్రతిసారీ తాను ఫ్రీగా బజ్జీలు, బొండాలు ఇవ్వనని రూ. 100 ఇస్తే బజ్జీలు పార్శిల్ కట్టి ఇస్తానని యజమాని షేక్ సలామ్ లీలావతికి చెప్పాడు. నీకు ఎంత ధైర్యం రా, 'పోలీసులనే డబ్బులు అడుగుతున్నావా అంటూ షేక్ సలామ్ మీద లీలావతి చిందులు వేసింది.

హలో 112.... త్వరగా రండిసార్

హలో 112.... త్వరగా రండిసార్

లీలావతి తీరుతో విసిగిపోయిన షేక్ సలాం ఆమె టార్చర్ భరించలేక పోలీసు హెల్ప్‌లైన్ 112కు ఫోన్ చేసి ఇక్కడ తాను లేడీ పోలీసు అంటూ ఓ మహిళ నానా హంగామా చేస్తోందని, మీరు వెంటనే రావాలని సమాచారం ఇచ్చాడు. షేక్ సలామ్ పోలీసు హెల్ప్‌లైన్‌కు కాల్ చేశాడని తెలుసుకున్న లీలావతి నీకథ రేపు చూస్తా ఉండూ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దం అయ్యింది.

 రోజూ టార్చర్ పెడుతోంది సార్

రోజూ టార్చర్ పెడుతోంది సార్

లీలావతి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో షేక్ సలామ్ ఆమెను అడ్డుకున్నాడు. లీలావతి, షేక్ సలామ్ మధ్య వాగ్వివాదం జరుగుతున్న సమయంలో 112 సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు, వెంటనే పోలీసులు లీలావతిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నకిలీ పోలీసు అని తేలింది. కొడిగేహళ్లి, బ్యాటరాయణపురంలోని పలు చోట్ల గత ఏడాది కాలంగా బేకరీలులో తినుబండారాలు, కూరగాయల వ్యాపారుల దగ్గర కూరగాయాలు, బజ్జీల అంగడిలో బజ్జీలు, బొండాలు ఫ్రీగా తినేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఫ్రీగా బిర్యానీలు తినేసి ఇంటికి మళ్లీ పార్శిల్

ఫ్రీగా బిర్యానీలు తినేసి ఇంటికి మళ్లీ పార్శిల్

లేడీ పోలీసు అధికారి అని చెప్పుకుంటూ గత ఏడాది కాలంగా చిరు వ్యాపారులను బెదిరించి బజ్జీలు, బొండాలు, కూరగాయలు ఫ్రీగా తీసుకు వెలుతోందని, హోటల్స్ లో బిర్యానీలు, కబాబ్ లు తింటున్న లీలావతి ఇంటికి పార్శిల్ తీసుకెలుతోందని తెలుసుకున్న పోలీసు అధికారులు హడలిపోయారు. కిలాడీ లేడీ లాలీవతిని బ్యాటరాయణపుర పోలీసులు అరెస్టు చేశారు. లీలావతి కొడుకు టెక్కీ, కూతురు డాక్టర్, భర్త ఇంజనీరు అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. అయితే లీలావతి ఎందుకు ఇలా చేస్తోందో ? అనే విషయం అర్థంకావడంలేదని, ఆమె గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

English summary
A woman who was carrying a parcel while eating biryanis and kababs for free, claiming to be a lady police officer, was arrested. Madam's husband is an engineer, daughter is a doctor, and son is a techie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X