Inspirational Story: అనుకున్నది సాధించారు.. ఆదర్శంగా నిలిచారు..
సమాజంలో ఇప్పటికీ ఆడవారిపై వివక్ష సాగుతోంది. గతంలో కంటే ఇప్పుడు కాస్త పరిస్తితి మారింది. కానీ కొన్ని స్త్రీల పై వివక్ష కొనసాగుతోంది. ముఖ్యంగా చదువు విషయంలో మహిళల పట్ల తేడా చూపిస్తున్నారు. గతంలో అయితే ఈ పరిస్థితి దారుణంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో చదువు కోసం పోరాటం లక్ష్మి పోరాటం ప్రారంభించింది. 10వ తరగతిలో టాపర్ గా నిలిచింది.

డిగ్రీ తర్వాత పెళ్లి
డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకేముంది అంత బాగానే ఉందని అనుకుంది. కానీ అప్పుడే మొదలైంది అసలు కథ.. డిగ్రీ చదివావు పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి మొదలైంది. తన పై చదువులు చుదువుకుంటానని లక్ష్మి ఎంత చెప్పిన పేరెంట్స్ వినలేదు. చివరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు.

ఇద్దరు పిల్లలు
లక్ష్మి ఆశాలపై నీళ్లు చల్లారు. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది లక్ష్మి. పిల్లలు, ఇల్లు చూసుకునే పనిలో పడిపోయింది. అయితే తను పై చదువుకోవాలని భర్తకు చెప్పడంతో అతను ఒప్పుకున్నాడు. దీంతో లక్ష్మి ఎంబీఏ,న్ విమె ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లలో కోర్సులతో పాటు పీహెచ్‌డీ చేశారు. ఆ తర్వాత ఉద్యోగంలో కూడా చేరారు.

ఉద్యోగం
లక్ష్మి ప్రస్తుతం బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ విభాగానికి హెడ్‌గా పని చేస్తున్నారు. వందల మంది విద్యార్థులకు మెంటర్‌గా, అధ్యాపకురాలిగా దిశానిర్దేశం చేస్తున్నారు లక్ష్మి. చివరికి తను అనుకున్నది సాధించారు. ప్రయత్నం చేస్తే సాధించేది ఏదీ లేదని చెబుతున్నారు. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాలని, తను ఇప్పటికీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానని 50 ఏళ్ల లక్ష్మి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications