డ్రగ్స్ విక్రయిస్తున్నాడని యువకుడి కాళ్లు, చేతులు పూర్తిగా నరికేశారు, చివరికి అతను !

Posted By:
Subscribe to Oneindia Telugu

బతిండా: డ్రగ్స్ విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని స్థానికులు అతి కిరాతంగా హత్య చేసిన ఘటన పంజాబ్ లోని బతిండా ప్రాంతంలో జరిగింది. బతిండా ఊరిలో నివాసం ఉంటున్న వినోద్ కుమార్ (25) అనే యువకుడు హత్యకు గురైనాడని పోలీసులు చెప్పారు.

వినోద్ కుమార్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడని సమాచారం. ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఊరు వదిలి వెళ్లిపోవాలని, నీ కారణంగా ఇక్కడ ఉన్న యువకులు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని గత సంవత్సరంలో వినోద్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చారు.

వెలివేశారు. మళ్లీ వచ్చాడు !

వెలివేశారు. మళ్లీ వచ్చాడు !

8 నెలల క్రితం వినోద్ కుమార్ ను ఊరి నుంచి బయటకు పంపించేశారు. అయితే గురువారం రాత్రి వినోద్ కుమార్ సొంత ఊరు అయిన బతిండాకు వెళ్లాడు. ఆ సందర్బంలో స్థానికంగా నివాసం ఉంటున్న కొంత మంది యువకులు వినోద్ కుమార్ ను అడ్డుకున్నారు.

తిరగబడితే నరికేశారు !

తిరగబడితే నరికేశారు !

వినోద్ కుమార్ తిరగబడంటంతో స్థానికులు సహనం కొల్పోయారు. పదునైన వేటకోడవళ్లు తీసుకుని వినోద్ కుమార్ కాళ్లు, చేతులు పూర్తిగా కత్తిరించేశారు. శరీరం నుంచి రెండు చేతులు, రెండు కాళ్లు తెగిపోవడంతో వినోద్ కుమార్ కుప్పకూలిపోయాడు.

చికిత్స చేస్తే మీ అంతు చూస్తాం !

చికిత్స చేస్తే మీ అంతు చూస్తాం !

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వినోద్ కుమార్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వినోద్ కుమార్ కు చికిత్స చెయ్యరాదని, చికిత్స చేస్తే మీ అంతుచూస్తామంటూ ఆసుపత్రి దగ్గర స్థానికులు గుమికూడి ఆందోళనకు దిగారు.

40 కిలోమీటర్ల దూరంలో!

40 కిలోమీటర్ల దూరంలో!

స్థానిక ఆసుపత్రి దగ్గర ఆందోళన ఎక్కువ కావడంతో పోలీసులు వెంటనే వినోద్ కుమార్ ను 40 కిలోమీటర్ల దూరంలో మరో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రక్తం పూర్తిగా కారిపోవడంతో వినోద్ కుమార్ మరణించాడని బతిండా పోలీసులు చెప్పారు.

 జైలు నుంచి బయటకు

జైలు నుంచి బయటకు

ఓ కేసులో అరెస్టు అయిన వినోద్ కుమార్ జైలుకు వెళ్లి నాలుగు రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడని పోలీసులు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు వినోద్ కుమార్ ను హత్య చేశారని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young man accused of drug dealing in Bathinda in Punjab was attacked by a mob in his village yesterday that chopped off his hand and sliced his legs. He died in hospital a few hours later.
Please Wait while comments are loading...