వాడి డబ్బులతో లిక్కర్ తాగి వాడినే హత్య చేస్తే ఆ కిక్కేవేరప్ప, ఆంటీ విషయంలో ఏం జరిగిందంటే ?

ఒకే ప్రాంతంలో ఉన్న యువకులు చెడు అలవాట్లకు బానిసలు అయ్యారు. కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు తీసుకుంటున్న యువకులు బార్ కు వెళ్లి మద్యం, సిగరేట్లు సేవిస్తున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి అలవాటు చేసుకున్న మద్యం తాగుడు చివరికి డైలీ తాగడం మొదలుపెట్టారు. లిక్కర్ పార్టీ ఇచ్చి డబ్బు ఖర్చు చేసిన యువకుడు ఓ ఆంటీ విషయంలో అతని ఫ్రెండ్స్ చేతిలోనే హత్యకు గురికావడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు నగరంలోని కోనెనకుంటె సమీపంలోని సత్యమ్మ కుంటేలో జనవరి 24వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురైనాడు. లిక్కర్ పార్టీ చేసుకుని మద్యం మత్తులో స్నేహితుల ఆగ్రహానికి గురైన దర్శన్ అనే యువకుడు హత్యకు గురైనాడు. దర్శన్ తలపై బండరాయి ఎత్తి వేసి అతన్ని దారుణంగా హత్య చేశారు.దర్శన్ హత్య కేసులో అతని స్నేహితులు చంద్రశేఖర్ అలియాస్ ప్రీతమ్, యశ్వంత్, ప్రశాంత్, లంకేష్ అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

A young man who gave a liquor party to his friends and was brutally murdered by the same friends in Bengaluru.

నలుగురు నిందితులు కలిసి దర్శన్ ను హత్య చేశారని పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూసేసరికి దర్శన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై దర్శన్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. దర్శన్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలీక పోలీసులు అయోమయంలో పడ్డారు. దర్శన్ హత్య కేసును పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు.

తరువాత పోలీసులకు ఒక్కో విషయం తెలిసింది. జనవరి 24వ తేదీన హత్యకు గురైన దర్శన్‌కు అతని పెద్దమ్మ రూ 3 వేలు ఇచ్చి మీ అమ్మకు ఇవ్వాలని చెప్పింది. తన తల్లికి ఇవ్వాల్సిన డబ్బు తీసుకున్న దర్శన్ అతని స్నేహితుడు కార్తీక్ తో కలిసి మద్యం సేవించడానికి అదే ప్రాంతంలోని బార్‌కు వెళ్లాడు. దర్శన్, అతని ఫ్రెండ్ కార్తీక్ మద్యం సేవిస్తున్న సమయంలో వాళ్ల స్నేహితులు ప్రీతమ్, యశ్వంత్, ప్రశాంత్, లంకేశ్ అక్కడికి వెళ్లారు.

A young man who gave a liquor party to his friends and was brutally murdered by the same friends in Bengaluru.

అందరూ కలిసి మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఆంటీ విషయంలో ప్రీతమ్, నితిన్ ల మధ్య గొడవ మొదలైంది. తరువాత మనం అందరూ ఫ్రెండ్స్ అని, ఓ ఆంటీ కోసం మనం ఎందుకు గొడవపడాలని అంటూ అదే బార్ లో రాజీ కావాలని అనుకున్నారు. ఫ్రెండ్స్ అందరూ రాజీ అయిపోవడంతో దర్శన్, నితిన్ కలిసి సత్యమ్మ రేకు ప్రాంతంలోని అతని ఫ్రెండ్ రమేష్ ఇంటికి వెళ్లారు. ప్రీతమ్ అండ్ గ్యాంగ్ దర్శన్, నితిన్ వెంబడించి వెళ్లారు.

తరువాత రమేష్ ఇంట్లోకి చోరబడిన యువకులు అక్కడే నితిన్‌ను కొట్టారు. దర్శన్ ఎదురుగా వచ్చి ప్రీతమ్‌పై దాడి చేసి నితిన్ ను విడిపించడానికి ప్రయత్నించాడు. నితిన్ ను వదిలేసిన అందరూ అడ్డుపడుతున్న దర్శన్ ను పట్టుకుని చితకబాదడంతో అతను కిందపడిపోయాడు, తరువాత నిందితులు అందరూ కలిసి బండా రాయి తీసుకొచ్చి దర్శన్‌ తల మీద వేశారని పోలీసులు తెలిపారు. పెద్దమ్మ ఇచ్చిన డబ్బుతో ఫ్రెండ్స్ కు లిక్కర్ పార్టీ ఇచ్చిన దర్శన్ అదే ఫ్రెండ్ తో గొడవపడి వారి చేతిలోనే హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+