బామ్మ తిట్టిందని ఈ బేవర్స్‌గాడు ఏం చేశాడంటే, డ్యామ్ వెనుక ?, క్లైమాక్స్ లో ?
బెంగళూరు/మైసూరు: అమ్మమ్మ తిట్లు తట్టుకోలేక అవ్వను హత్య చేసి ఆమె శవానికి నిప్పంటించిన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మైసూరు నగరంలోని గాయత్రీపురం నివాసి సుప్రీత్ (23) హత్యకు పాల్పడ్డ యువకుడు. అమ్మమ్మ సులోచన(75)ను హత్య చేసిన సుప్రీత్ ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి అట్టపెట్టెలో పెట్టి కారులో కేఆర్ ఎస్ డ్యామ్ బ్యాక్ వాటర్ వద్దకు తీసుకెళ్లి పెద్ద గోతి తీసి అందులో శవాన్ని తగులబెట్టాడు.
ఇటీవల సగానికి కాలిన స్థితిలో వృద్ధురాలి మృతదేహం కనిపించడంతో ఇలవాల పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొనసాగించిన ఇలావల పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నిందితుడిని పట్టుకోవడంలో సఫలం అయ్యారు. తరచూ తిట్టిన బామ్మ సులోచనాను నిందితుడు సుప్రీత్ ఇంట్లో ఆమెను కిందకు తోసేశాడు. తోపు తాకిడికి బామ్మ సులోచన కిందపడటంతో ఆమెకు గాయాలు అయ్యాయి.

ఈ సమయంలో దిండుతో సులోచన ముఖం మీద పెట్టి ఆమెకు ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసి, కేఆర్‌ఎస్ బ్యాక్‌వాటర్ వద్ద మృతదేహాన్ని తీసుకొచ్చి దహనం చేశారు. విచారణ బృందంలో ఇన్ స్పెక్టర్ జి.ఎస్. స్వర్ణ, ఎస్ ఐ సురేష్ బోపన్న, సిబ్బంది రవికుమార్, ధర్మ, సిద్దవీరప్ప, ప్రకాష్, జగదీష్ శెట్టి, ఆనంద్, మనోహర్, అరుణేష్, మంజునాథ్, నింగరాజగౌడ్ ఉన్నారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ సీమా లత్కర్ అభినందించారు.
మైసూరులోని బిలాలాబాద్‌కు చెందిన బాబా ఖాన్ అలియాస్ ఉమర్ ఖాన్ (25) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు, ఆజాద్‌పూర్ రోడ్‌లోని హుండేకర కాలనీ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. అరెస్టు అయిన నిందితులు హుండేకర కాలనీకి చెందిన మహ్మద్ అల్లాబక్ అలీ అలియాస్ సైఫాన్ (23), మహ్మద్ మక్దూమ్ అలీ (20)లు. బిలాలాబాద్‌కు చెందిన బాబాఖాన్ అలియాస్ ఉమర్ ఖాన్ తో నిందితులకు 10 గంటల ప్రాంతంలో చిన్న చిన్న కారణాలతో గొడవలు జరగడంతో నిందితులు అతన్ని కత్తులతో పొడిచి చంపేశారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications